Google Pixel 8 Series Launch : గూగుల్ సంస్థ 'మేడ్ బై గూగుల్' ఈవెంట్లో.. సరికొత్త పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది. అలాగే గూగుల్ వాచ్ 2, గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రోలను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా గూగుల్ ఈ ప్రొడక్టులను లేటెస్ట్ ఏఐ ఫీచర్స్, కేపబిలిటీస్తో తీసుకురావడం విశేషం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో..
గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రోలలో.. ఏఐ కేపబిలిటీతో కూడిన బెస్ట్ కెమెరాలు ఉన్నాయి. వీటితో చిమ్మ చీకటిలోనూ క్లారిటీగా ఫొటోలు తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. పిక్సెల్ వాచ్ 2లోని హార్ట్ రేట్ సెన్సార్ అనేది ఏఐ అనుసంధానంతో పనిచేస్తుంది. కనుక దీనితో చాలా కచ్చితత్వంతో.. హార్ట్ రేట్ మానిటరింగ్ చేయడానికి వీలవుతుంది.
Google Pixel 8 and Pixel 8 Pro Features : గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో.. రెండూ గూగుల్ టెన్సర్ జీ3తో పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ రెండు ఫోన్లు కూడా ఏఐ క్యాపబిలిటీస్ కలిగి ఉంటాయి. ఈ గూగుల్ ఫోన్లలో.. ఆస్ట్రోఫొటోగ్రఫీ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా అత్యంత చీకటిలోనూ చాలా క్లారిటీగా ఫొటోలు తీయడానికి వీలు అవుతుంది. అలాగే ఈ ఫోన్స్‌లో కార్ క్రాష్ డిటెక్షన్, అన్‌బ్లర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను అదిరిపోయే కెమెరా ఫీచర్లతో రూపొందించడం జరిగింది. వీటి ద్వారా చాలా హై క్వాలిటీతో.. స్టన్నింగ్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. పైగా ఈ ఫోన్లలో బెస్ట్ గేమ్ ఛేంజింగ్ ఎడిటింగ్ టూల్స్‌ను కూడా ఇవ్వడం జరిగింది.
Google Pixel 8 and Pixel 8 Pro Price :
- గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 12 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
- గూగుల్ పిక్సెల్ 8 ధర - సుమారు రూ.58,192 (699 డాలర్లు)గా ఉంది.
- గూగుల్ పిక్సెల్ 8 ప్రో ధర - సుమారు రూ.74,842 (899 డాలర్లు)గా ఉంది.
Google Pixel Watch 2 : గూగుల్ పిక్సెల్ వాచ్ 2లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా హృదయ స్పందనలను అత్యంత కచ్చితత్వంతో కొలిచే సెన్సార్లను ఇందులో అమర్చడం జరిగింది. వాస్తవానికి దీనిని 100% రీసైకిల్డ్ అల్యూమినియంతో రూపొందించారు. అందుకే ఈ గూగుల్ పిక్సెల్ 2 దాని ప్రీవియస్ వెర్షన్ కంటే దాదాపు 10 శాతం తక్కువ బరువును కలిగి ఉంది.
Google Pixel Watch 2 Features : గూగుల్ పిక్సెల్ వాచ్ 2లో క్వాడ్-కోర్ సీపీయూ, లో-పవర్ కో-ప్రాసెసర్ ఉన్నాయి. ఈ వాచ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 24 గంటల వరకు పనిచేస్తుంది.
Google Pixel Watch 2 Price : ఈ గూగుల్ వాచ్ 2 అక్టోబర్ 13 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. భారత్‌లో దీని ధర రూ.39,900 వరకు ఉంటుంది.
Google Pixel Buds Pro : గూగుల్ చివరికి పిక్సెల్ ఎయిర్‌బడ్స్‌ను కూడా ఏఐ టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. దీని వల్ల మీరు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మ్యూజిక్ ఆగిపోతుంది. ఒక వేళ మీరు మ్యూజిక్ ఆస్వాదిస్తూ ఉంటే.. బ్యాక్ గ్రౌండ్ నోయిస్ లేకుండా చేస్తుంది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో వివిధ రంగుల్లో లభిస్తుంది.
Google Pixel Buds Pro Features : గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో.. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రోలను సపోర్ట్ చేస్తుంది. దీనిలోని బ్లూటూత్ సూపర్ వైడ్‌బ్యాండ్.. అంత్యంత సహజంగా, క్లియర్‌గా సౌండ్స్ వినిపించేలా చేస్తుంది.
Google Pixel Buds Pro Price : గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ధర రూ.16,566 (199 డాలర్లు)గా ఉంది.
AI Chatbot With Virtual Assistant : గూగుల్ కంపెనీ తన వర్చువల్ అసిస్టెంట్‌తో జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది.
వివో వీ 29 సిరీస్ ఫోన్స్ లాంఛ్
Vivo V29, V29 Pro Launched In India : వివో కంపెనీ భారత్‌లో V29 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసింది. వివో V29, V29 Pro పేర్లతో తీసుకువచ్చిన ఈ రెండు మిడ్-రేంజ్ ఫోన్లలో ప్రాసెసర్, కెమెరా మినహా.. మిగతా ఫీచర్లు అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి.
Vivo V29, V29 Pro Specifications :
- వివో వీ 29 ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్సెట్ అమర్చారు.
- వివో వీ29 ప్రో ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అమర్చడం జరిగింది.
- వివో వీ29లో 50MP +8MP+2MP కెమెరా సెటప్ ఉంది.
- వివో వీ29ప్రో ఫోన్లో 50MP +8MP+12MP కెమెరా సెటప్ ఉంది.
- వివో వీ29, వీ 29 ప్రో రెండింటిలోనూ.. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 4600 mAh బ్యాటరీ విత్ 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- వివో వీ 29, వివో వీ29 ప్రో రెండూ కూడా..8జీబీ+256జీబీ & 12జీబీ+512జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తాయి. హైయ్యర్ ఎండ్ ఫోన్ హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
- అక్టోబర్ 10 నుంచి వివో వీ29 ప్రో, అక్టోబర్ 17 నుంచి వివో వీ 29.. ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
Vivo V29 Series Prices
- వివో 29 ఫోన్ (8జీబీ+256జీబీ వేరియంట్) ధర రూ.32,999
- వివో 29 ఫోన్ (8జీబీ+256జీబీ వేరియంట్) ధర రూ.36,999
- వివో 29 ఫోన్ ప్రో (8జీబీ+256జీబీ వేరియంట్) ధర రూ.39,999
- వివో 29 ఫోన్ ప్రో (12జీబీ+512జీబీ వేరియంట్) ధర రూ.42,999
Samsung Galaxy S23 FE : శాంసంగ్ సరికొత్త గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ అనే ఫ్యాన్ ఎడిషన్ సిరీస్‌ను లాంఛ్ చేసింది.
Samsung Galaxy S23 FE Specifications :
- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చారు. దీని ద్వారా హైఎండ్ గేమ్స్, వీడియో స్ట్రీమింగ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.
- ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో 6.4 అంగుళాల 4 డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్లో విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా ఫోన్ బ్రైట్నెస్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్లో 50MP+12MP+8MP కెమెరా సెటప్ ఉంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో వస్తుంది. వాస్తవానికి దీనిని పూర్తి రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారు చేశారు. అందుకే ఈ ఫోన్ వెయిట్ కేవలం 209 గ్రాములు మాత్రమే ఉంది.
Samsung Galaxy S23 FE Price : శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ధర రూ.49,999గా ఉంది.