ETV Bharat / science-and-technology

అక్టోబర్​లో గూగుల్​ కొత్తఫోన్​.. వన్​ప్లస్ 9టీ రిలీజ్​కు బ్రేక్ - oneplus 9rt features

గూగుల్​ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పిక్సెల్​ 6, 6 ప్రో స్మార్ట్​ఫోన్​లు (Google Pixel 6 Pro) విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని అక్టోబర్​లో విడుదల చేసేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అలాగే వన్​ ప్లస్​.. 9టీ సిరీస్​ విడుదలను వాయిదా వేసింది.

Google Pixel 6 Pro
గూగుల్​ పిక్సెల్​ 6 ప్రో
author img

By

Published : Sep 21, 2021, 3:07 PM IST

గూగుల్​ మరో రెండు స్మార్ట్​ఫోన్లను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పిక్సెల్​ 6, పిక్సెల్​ 6 ప్రో (Google Pixel 6 Pro) పేరుతో ఇవి అక్టోబర్​లో విడుదల కానున్నట్లు తైవాన్​కు చెందిన ఎన్​సీసీ డేటాబేస్​ తెలిపింది. పిక్సెల్​ 6 ప్రో 33వాట్స్​ స్పీడ్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేస్తోందని పేర్కొంది. దీనిలో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీని కూడా తీసుకొస్తుందని తెలిపింది.

పిక్సెల్ 6 ప్రో ఫీచర్లు..

  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ.. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 6.71 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • 1,440x3,120 రిజల్యూషన్​తో డిస్​ప్లే, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​
  • డిజిటల్​ కార్​ కీ ఆప్షన్​
  • 12 జీబీ ర్యామ్/512 జీబీ స్టోరేజి,
  • ట్రిపుల్​ రేర్​ కెమెరా, 50 ఎంపీ శాంసంగ్​ జీఎన్​1 ప్రైమరీ సెన్సార్​(12ఎంపీ, 48ఎపీ).
  • ఆండ్రాయిడ్​ 12, ఆక్టా కోర్​ సీపీయూ.
  • సుమారు 80 వేల వరకు ఉండొచ్చని అంచనా.
  • వైఫై 6ఈ సదుపాయం
  • బ్లూటూత్​
  • జీపీఎస్​

వన్​ప్లస్​ 9టీ సిరీస్​ విడుదల వాయిదా..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్​ప్లస్​ 9టీ (Oneplus 9t)సిరీస్​ విడుదలకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. తొలుత ఈ ఏడాది చివరి కల్లా విడుదల చేయాలని భావించినా.. ఆ ప్రయత్నాలు విఫలమైనట్లు సంస్థ తెలిపింది. వన్​ప్లస్​ 9టీ, 9టీ ప్రోలను వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. వీటికి బదులుగా వన్​ప్లస్​ నోర్డ్​, ఆర్​ సిరీస్​ల మీద దృష్టిసారించనున్నట్లు తెలిపింది.

వన్​ప్లస్​ ఇటీవలే మరో స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పోతో కలిసింది. ఇవి రెండూ కలిసి ఆక్సిజన్​ ఓఎస్​ను తరువాత వచ్చే ఫోన్​లో అందుబాటులోకి తీసుకురానున్నాయి. దీనిలో ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ప్రధాన సాఫ్ట్​వేర్​లు ఉండనున్నాయి. అదే వన్​ప్లస్​ 9ఆర్​టీ(Oneplus 9RT).

వన్​ప్లస్​ 9ఆర్​టీ ఫీచర్లు..

  • స్నాప్​డ్రాగన్​ 870
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ.. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 50ఎంపీ కెమెరా

ఇదీ చూడండి: Whatsapp App: మీ వాట్సాప్ ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్​ల్లో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.