ETV Bharat / science-and-technology

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

Google Maps Live Location : వాట్సాప్​ లాంటి ఇతర యాప్​లతో సంబంధం లేకుండా సులువుగా మీ లైవ్​ లొకేషన్​ను ఇతరులతో షేర్​ చేసుకునే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్ మ్యాప్స్​. మరి దీనిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Share Realtime Location With Google Maps
Google Maps Live Location
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 5:37 PM IST

Google Maps Live Location : తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు వాడే లైవ్​ లొకేషన్​ను ఇక నుంచి గూగుల్​ మ్యాప్స్​ యాప్​ నుంచే నేరుగా షేర్​ చేయవచ్చు. అలాంటి సదుపాయాన్ని అన్ని రకాల మొబైల్​ యూజర్స్​ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్​. అయితే ఇంతకుముందు ఈ రియల్​టైమ్​ లేదా లైవ్​ లొకేషన్​ను మన బంధువులకు, స్నేహితులకు పంపేదుకు వాట్సాప్​ లాంటి ఇతర థర్డ్​ పార్టీ యాప్​లు వాడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు గూగుల్​ లాంఛ్​ చేసిన ఫీచర్​తో అలాంటి ఏ అప్లికేషన్​ల సాయం లేకుండానే సులువుగా మనకి కావాల్సిన వాళ్లకి కేవలం సాధారణ మెసేజ్‌ ద్వారానే మన లైవ్​ లొకేషన్​(రియల్‌టైమ్‌ లొకేషన్‌)ను షేర్​ చేసుకోవచ్చు.

నో టైమ్​ లిమిట్​
ప్రస్తుతం వాట్సాప్​ ద్వారా పంపే లైవ్​లొకేషన్​ షేరింగ్​కు కొన్ని పరిమితులు ఉన్నాయి. 15 నిమిషాలు, 60 నిమిషాలు, 8 గంటలు ఇలా లిమిటెడ్​ లైవ్ ​లొకేషన్​ షేరింగ్​ ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ సమయాలు దాటాయంటే లొకేషన్​ షేరింగ్​ దానికదే ఆగిపోతుంది. కానీ, గూగుల్​ మ్యాప్స్​ తెచ్చిన ఈ నయా ఫీచర్​లో అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. అంటే టైమ్​ లిమిట్​ అంటూ ఏమీ ఉండదు. ఎంతసేపటి వరకైనా మీరు పంపిన రియల్​టైమ్​ లొకేషన్​ను ఆన్​లో ఉంచవచ్చు. మనం ఆపాలనుకున్నప్పుడు మాత్రమే దానిని ఆఫ్​​ చేయవచ్చు.

అవతలి యూజర్​ కూడా
గూగుల్​ లాంఛ్​ చేసిన ఈ కొత్త ఫీచర్​ను మీరు ఆస్వాదించాలంటే ముందుగా మీరు గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యి ఉండాలి. అంతేకాకుండా అవతలి యూజర్​ లేదా మీకు సంబంధించిన వ్యక్తి కూడా గూగుల్​ మ్యాప్స్​ యాప్‌లో లాగిన్​ అవ్వడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ చాలామంది కొన్ని కారణాల వల్ల వాట్సాప్​ను వినియోగించరు. అలాంటి వారికి గూగుల్​ మ్యాప్స్​ లైవ్​ లొకేషన్​ షేరింగ్​ ఆప్షన్​ ఎంతగానో ఉపయోగపడనుందని అంటున్నారు కొందరు టెక్​ ప్రియులు.

ఎలా వాడాలంటే?

  • ముందుగా గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి.
  • యాప్​లో కుడివైపున కనపడే ఫ్రొఫైల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి.
  • అందులో కనిపించే 'Location Sharing' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • స్క్రీన్‌పై కనిపిస్తున్న 'New Share'పై క్లిక్‌ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.
  • లేదా 'Until You Turn This Off' ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత మీరు లైవ్​లొకేషన్​ పంపించాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలెక్ట్‌ చేసుకొని మెసేజ్‌ సెండ్‌ చేయండి.
  • షేరింగ్‌ను ఆపేయాలనుకుంటే ప్రొఫైల్‌ ఖాతాలోకి వెళ్లి 'Stop Sharing Option'పై క్లిక్‌ చేస్తే లొకేషన్​ షేరింగ్​ స్టాప్​ అవుతుంది.

గమనిక : భారతదేశంలో 13 ఏళ్లలోపు పిల్లలకు ఈ ఫీచర్​ను అందుబాటులో ఉంచడం లేదని గూగుల్ తెలిపింది. అంతేకాకుండా, ఇది Google Workspace డొమైన్ ఖాతాలతో పని చేయదు. అలాగే Google Maps Goలో కూడా అందుబాటులో ఉండదు అని స్పష్టం చేసింది.

గూగుల్​ మ్యాప్స్​తో ఇవి కూడా

  • మీ మొబైల్​లో ఎంత శాతం బ్యాటరీ మిగిలి ఉంది, అలాగే డివైజ్​ ఛార్జ్​ అవుతుందో లేదో అనే విషయాలను కూడా గూగుల్​ మ్యాప్స్​ ద్వారా తెలుసుకోవచ్చు.
  • మీరు నావిగేట్​ చేస్తున్న గమ్యస్థానానికి చేరే అంచనా సమయాన్ని కూడా ఇది చూపిస్తుంది.

రెడ్​మీ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్​​- ఐఫోన్ కంటే సూపర్​ కెమెరా!- ధర ఎంతంటే?

స్క్రీన్ ఆఫ్ ఉన్నా యూట్యూబ్ చూడాలా? ప్రీమియం కాకుండా ఇలా ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.