ETV Bharat / science-and-technology

Google Deleting Gmail and YouTube Accounts : జీమెయిల్​, యూట్యూబ్​ అకౌంట్లు డెలిట్ చేస్తున్న గూగుల్.. వెంటనే ఈ పనిచేయండి! - జీమెయిల్ డిలీట్ కావద్దంటే ఏం చేయాలి

Google Deleting YouTube and Gmail Accounts: జీమెయిల్​, యూట్యూబ్​ యూజర్లకు.. టెక్​ దిగ్గజం గూగుల్​ షాక్​ ఇచ్చింది. పలు జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని డెలిట్​ చేయబోతున్నట్టు ప్రకటించింది. మరి, అందులో మీ అకౌంట్స్ ఉన్నాయా..? అసలు ఎందుకు డెలిట్​ చేయబోతోంది..??

Google Deleting YouTube and Gmail
Google Deleting Gmail and YouTube Accounts
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 12:26 PM IST

Google Deleting YouTube and Gmail : మీకు జీమెయిల్ (Gmail Account) అకౌంట్ ఉందా? యూట్యూబ్ (YouTube Account) కూడా క్రియేట్ చేసుకున్నారా? అయితే మీకు ఓ హెచ్చరిక! సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఏ క్షణమైన మీ అకౌంట్లను డెలిట్ చేయెచ్చు. ఈ విషయాన్ని కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. అయితే.. ఏ అకౌంట్లను డెలిట్ చేస్తుంది? అంటే.. యాక్టివ్ లో ఉన్నవాటికి ముప్పు లేదు. చాలా కాలంగా వాడకుండా ఉన్న మెయిల్స్ ను డెలిట్ చేస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటించింది.

ఈ రూల్స్ ప్రకారం జీమెయిల్ (Gmail), యూట్యూబ్ (YouTube) ఖాతాదారులను గూగుల్ హెచ్చరిస్తోంది. నిబంధనలు పాటించే వారికి ఇబ్బంది లేదని చెప్తోంది. డిసెంబర్ 2023 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని గూగుల్ పేర్కొంది. అకౌంట్లను డిలీట్ చేసే ప్రమాదం ఉన్న వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు.. 8 నెలల ముందు నుంచే వార్నింగ్ మెయిల్‌ పంపుతోంది.

Gmail Tips : ఈ సింపుల్​ టిప్స్ & ట్రిక్స్​ తెలుసా?.. వీటితో మీ ప‌నులు మ‌రింత ఈజీగా!

ఇన్​యాక్టివ్​ ఖాతాలపై దృష్టి:

Google Focus on Inactive Accounts: యాక్టివ్ గా లేని జీమెయిల్ (GMail), యూట్యూబ్ ఖాతాలను గుర్తించే పనిలో ప్రస్తుతం గూగుల్ ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఇనాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఇన్​యాక్టివ్​లో ఉన్న మెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించడం ద్వారా అనవసర భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్​ను కూడా తగ్గించుకోవచ్చని గూగుల్ భావిస్తోంది. యాక్టివ్​లో లోని ఖాతాలను డెలిట్ చేస్తే, ఆయా అకౌంట్లలోని మెయిల్స్, డాక్యుమెంట్స్, ఫొటోస్, డ్రైవ్, క్యాలెండర్, యూట్యూబ్​ల్లోని సమాచారం సహా మొత్తం కంటెంట్ అంతా డెలిట్ అవుతుంది.

దశల వారీగా తొలగింపు..: ఇన్​యాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. అకౌంట్​ను క్రియేట్ చేసిన తరువాత, ఒక్కసారి కూడా ఉపయోగించని ఖాతాలను మొదట డిలీట్ చేస్తామని వివరించింది. ఆ తర్వాత.. రెండేళ్లుగా యాక్టివ్​గా లేని ఖాతాలను డెలిట్ చేస్తామని ప్రకటించింది. డెలిట్ చేసే ముందు.. ఆ అకౌంట్​కు ఉన్న రికవరీ అకౌంట్​ను కూడా తొలగించబోతున్నామని హెచ్చరిస్తూ మెయిల్స్ పంపిస్తామని తెలిపింది. అయితే, వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని, వ్యాపార సంస్థలు, పాఠశాలలకు సంబంధించిన జీమెయిల్ ఖాతాలను తొలగించబోమని స్పష్టం చేసింది.

మీ జీమెయిల్​ జాగ్రత్త.. వాటిని క్లిక్​ చేస్తే హ్యాకర్​కు చిక్కినట్లే!

ఇన్​యాక్టివ్​ ఖాతాలను Google ఎందుకు తొలగిస్తోంది..? :

Why Google Deleting Inactive Accounts: సెక్యూరిటీ మెరుగుపర్చేందుకు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను తొలగించాలని గూగుల్ భావిస్తోంది. యాక్టివ్ అకౌంట్‌ల కంటే ఇన్​యాక్టివ్​ ఖాతాల్లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ దాదాపుగా ఉండదని, అందువల్ల హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను తొలగించడం వల్ల ఈ తరహా దాడుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని గూగుల్ పేర్కొంది.

జీమెయిల్ డిలీట్ కావద్దంటే ఏం చేయాలి?

What to do if Gmail won't delete?: ఇనాక్టివ్ గా ఉన్న మీ జీ మెయిల్ ఖాతా డెలిట్ కాకూడదనుకుంటే.. ముందుగా ఈ పనులు చేయాలి.

  • వెంటనే ఆ ఇనాక్టివ్ ఖాతాను యాక్టివేట్ చేయండి.
  • టూ ఫాక్టర్ ఆథెంటికేషన్ ను సెట్ చేయండి.
  • ఆ అకౌంట్ నుంచి ఎవరికైనా మెయిల్ చేయండి.
  • గూగుల్ డ్రైవ్ ను ఉపయోగించండి.
  • జీమెయిల్​ అకౌంట్​తో అనుసంధానమై ఉన్న యూట్యూబ్ అకౌంట్ ను ఓపెన్ చేసి, ఏవైనా వీడియోలు చూడండి.
  • గూగుల్ సెర్చ్ ను వాడండి.
  • ఆ జీమెయిల్​తో వేరే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ను యాక్టివేట్ చేసుకోండి.
  • మీరు రెండు సంవత్సరాల పాటు మీ గూగుల్​ ఖాతాను ఉపయోగించకపోయినా.. మీ అకౌంట్​ ద్వారా ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ సెటప్ చేయబడి ఉంటే Google మీ ఖాతాను తొలగించదు.

జీమెయిల్, యూట్యూబ్ డౌన్.. నెటిజన్ల తీవ్ర అవస్థలు

మీ జీమెయిల్​ ఖాతాలో వేరేవాళ్లు లాగిన్ అయ్యారని డౌటా, చెక్ చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.