ETV Bharat / science-and-technology

సుందర్​ పిచాయ్​.. ఒకేసారి ఇన్ని ఫోన్లు వాడతారా! - గూగుల్​ సీఈఓ

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. తన టెక్​ అలవాట్లను తెలిపారు. పాస్​వర్డ్​లను ఎన్నిసార్లు మార్చుకోవాలి? పిల్లల 'స్క్రీన్​ టైమ్​'పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Sundar Pichai
సుందర్​ పిచాయ్​
author img

By

Published : Jul 13, 2021, 12:17 PM IST

Updated : Jul 13, 2021, 3:59 PM IST

దిగ్గజ టెక్​ కంపెనీల సీఈఓలు తమ 'టెక్​' అలవాట్లు షేర్ చేయడం చాలా అరుదు. కానీ ఒకవేళ పంచుకుంటే.. ఎన్నో ఉపయోగకర విషయాలు తెలుస్తాయి. తాజాగా.. గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. తనకున్న టెక్​ అలవాట్లను వెల్లడించారు. పాస్​వర్డ్​లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలా? వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అవేంటో చూసేద్దాం..

మీ పిల్లలు యూట్యూబ్​ వీడియోలు చూసేందుకు అనుమతిస్తారా?

కచ్చితంగా. ఈ తరం పిల్లల జీవితాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల వారు సాంకేతికతకు అలవాటు పడటం ముఖ్యం.

మీ పిల్లల 'స్క్రీన్​ టైమ్​'పై మీరు జాగ్రత్తగా ఉంటారా?

ఫోన్లు, సామాజిక మాధ్యమాలను ఎంత సేపు చూడాలనే విషయాన్ని నా పిల్లలకే వదిలేస్తాను. అది వ్యక్తిగత బాధ్యతగా నేను భావిస్తాను.

సాంకేతికతతో పిల్లలపై దుష్ప్రభావం ఉంటుందా?

ఈ అంశం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చరిత్ర మొత్తం చూసినా సాంకేతికత ప్రభావంపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.

మీ పాస్​వర్డ్​లను తరచూ మారుస్తారా?

లేదు. పాస్​వర్డ్​లు మార్చడం చాలా తక్కువ. అయితే పాస్​వర్డ్​ విషయంలో రెండంచెల వెరిఫికేషన్​ను అనుసరించడం మంచిది.

మీరు ఎన్ని ఫోన్లు వాడతారు?

ఒకేసారి 20కుపైగా ఫోన్లు వాడతాను. అందుకు వివిధ కారణాలు ఉంటాయి. ఆ ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను.

కృత్రిమ మేధపై మీ అభిప్రాయం?

కృత్రిమ మేధ.. మనిషి అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతికత. ఇంటర్నెట్​ చూశారుగా. ఇది అంతకు మించి!

ఇదీ చూడండి:- అందుబాటు ధరలో గూగుల్- జియో స్మార్ట్​ఫోన్!

Last Updated : Jul 13, 2021, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.