ETV Bharat / science-and-technology

జీ-మెయిల్ యూజర్స్ తెలుసుకోవాల్సిన టాప్​-9 హిడెన్ ఫీచర్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 1:32 PM IST

Gmail Hidden Features In Telugu : మీరు వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా జీ-మెయిల్ ఉపయోగిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. జీ-మెయిల్​లో అనేక హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే, చాలా సులువుగా మన పని పూర్తి చేసుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో అందరికీ ఉపయోగపడే టాప్​-9 హిడెన్ జీ-మెయిల్​ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

unknown Gmail features
gmail hidden features

Gmail Hidden Features : దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన జీ-మెయిల్ అతికొద్ది కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. దానికనుగుణంగానే జీమెయిల్​ కూడా ఎప్పటికప్పుడు తమ యూజర్లకు నూతన సేవలందిస్తూ వస్తోంది. అయితే ఇందులో ఉన్న కొన్ని బెస్ట్​ ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. దానికి కారణం అవి జీ-మెయిల్ అకౌంట్​లో అంత సులభంగా కనిపించవు. కానీ వీటి గురించి తెలుసుకుంటే, చిన్నచిన్న తప్పులు జరిగినప్పుడు కంగారు పడకుండా, వెంటనే వాటిని సరిచేసుకోవచ్చు. వేగంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే ఆ హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రండి.

1. ఈ-మెయిల్​ అన్​డూ : కొన్నికొన్ని సందర్భాల్లో పొరపాటున తప్పుడు ఫైల్ అటాచ్ చేసి ఈ-మెయిల్ పంపిస్తుంటాం. అది గమనించేలోపే ఆ సందేశం అవతలివారికి చేరుతుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి జీ-మెయిల్ అకౌంట్​లో ఒక ఫీచర్ ఉంది. దీని కోసం జనరల్ సెట్టింగ్స్​లోకి వెళ్లి అందులోని "Enable Undo Send" అనే అప్షన్​కు క్లిక్ చేయండి. దానిలో 5 ,10, 20, 30 సెకన్లలోపు సందేశాన్ని క్యాన్సిల్ చేసే అప్షన్ ఉంటుంది. సాధారణంగా దీనిని 30 సెకన్ల వ్యవధికి సెట్ చేసుకోవడం ఉత్తమం.

2. డెలిగేట్స్ ఫీచర్ : మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లినా, లేదా వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లినా, మీ జీ-మెయిల్​ను చూసుకోవడం కష్టం అవుతుంది. ఇతరులను సహాయం కోరదామంటే, పాస్​వర్డ్​తోపాటు, మన వ్యక్తిగత సమాచారం కూడా తెలిసిపోతుందేమోనని భయం ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, ఇతరులకు తాత్కాలికంగా మన అకౌంట్ యాక్సిస్ ఇచ్చే 'డెలిగేట్ ఫీచర్'​ జీ-మెయిల్​లో ఉంది. దానిని ఎనేబుల్​ చేసుకుంటే, డెలిగేట్స్ మీ జీ-మెయిల్​లో మెసెజ్​లు పంపడం లేదా తొలగించడం మాత్రమే చేయగలరు. మీ పాస్​వర్డ్ మార్చడానికి లేదా ఇతరులతో చాట్ చేయటానికి కానీ వారికి ఎలాంటి అవకాశముండదు.

3. కాన్ఫిడెన్సియల్​ మోడ్​ :
జీ-మెయిల్​లో కాన్ఫిడెన్షియల్ మోడ్ ఉంటుంది. దీనిని వాడటం ద్వారా, మనం పంపిన ఈ-మెయిల్ కొద్దిసేపటి తర్వాత దానంతట అదే తొలగిపోతుంది. అవతలి వ్యక్తి ఈ మెయిల్​ను కాపీ, ప్రింట్​, ఫార్వార్డ్​, డౌన్​లోడ్ చేయడం​ లాంటివి ఏవీ చేయలేడు. ఏదైనా రహస్య సమాచారాన్ని పంపాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించడానికి జీ-మెయిల్​లోకి వెళ్లి, కంపోజ్​ను క్లిక్ చేసి, కాన్ఫిడెన్షియల్ మోడ్​ను ఎనేబుల్ చేసుకోవాలి.

4. స్పెల్ చెక్
సాధారణంగా ఈ-మెయిల్ చేసేటప్పుడు అక్షరదోషాలు వస్తుంటాయి. అయితే తొందరపాటులో వాటిని మనం గుర్తించం. అందుకే స్పెల్ చెక్​ను యాక్టివేట్ చేయటం ద్వారా మెయిల్​లో ఏవైనా లోపాలుంటే, వాటిని సరిచేసుకోవడానికి వీలవుతుంది.

5. ఆటో రెస్పాండర్
మీరు 2,3 నెలల పాటు జీ-మెయిల్​ను ఉపయోగించనట్లయితే, వెకేషన్ ఆటో-రెస్పాండర్‌ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా మీకొచ్చే మెయిల్​కు దానంతట అదే రిప్లై ఇస్తుంది. అయితే ఇది మీ కాంటాక్ట్స్​లో ఉన్న మెయిల్స్​ అడ్రస్​లకు మాత్రమే ఆటో-రిప్లై ఇస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.

6. వ్యూ ఈ-మెయిల్స్
కొన్ని సార్లు మన ఇన్​బాక్స్ మెుత్తం ఈ-మెయిల్స్​తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు అన్ని మెసేజ్​లు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరికొన్ని సార్లు డిఫాల్ట్​గా కనిపించే 50 మెయిల్స్ కన్నా, ఎక్కువ చూడాల్సి వస్తుంది. దీనికోసం జీ-మెయిల్ సెట్టింగ్స్​లోకి వెళ్లి డిఫాల్ట్ వ్యూ కాన్వర్జేషన్స్​ ఆప్షన్​ను క్లిక్ చేసి, మీకు ఇన్​బాక్స్​లో ఎన్ని మెయిల్స్​ కనిపించాలో సెట్​ చేసుకోవచ్చు. దీనితో ఒక పేజీలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 100 మెయిల్స్ వరకు చూసుకోవచ్చు.

7. కలర్ కోడ్
జీ- మెయిల్​లో ఉండే నక్షత్రపు గుర్తుల కోసం మనకు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు. ఒకప్పుడు కేవలం యెల్లో కలర్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బ్లూ, గ్రీన్​, రెడ్​, పర్పుల్​ కలర్స్​లో మీకు నచ్చిన దానిని సెట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు వచ్చే ఈ-మెయిల్స్​ను ప్రాధాన్యత క్రమంలో సెట్ చేసుకోవచ్చు.

8. టెంప్లెట్స్
మనం చాలా మందికి ఈ-మెయిల్స్​ పంపిస్తూ ఉంటాం. బల్క్​గా పంపించాల్సి వచ్చినప్పుడు, ప్రతిసారీ టైప్​ చేసిందే, టైప్​ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ధన్యవాదాలు, శుభోదయం లాంటి రెగ్యూలర్ పదాలకు జీ -మెయిల్​లో ఉండే టెంప్లెట్స్​ను ఉపయోగించవచ్చు. దీని వల్ల మీరు ప్రతిసారీ రిపీటెడ్​గా వీటిని కంపోజ్ చేసే అవసరం ఉండదు. పైగా సమయం కూడా ఆదా అవుతుంది.

9. ఆఫ్​లైన్ యాక్సెస్​
మనం ఏవైనా ప్రయాణాలు చేయాల్సివచ్చినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సరిగ్గా ఉంటుందో, లేదో తెలియదు. అటువంటి సమయంలో ఆఫ్​లైన్​ మోడ్​ను ఉపయోగించవచ్చు. దీని కోసం సెట్టింగ్స్​లోకి వెళ్లి, ఆఫ్​లైన్​ మోడ్​ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనితో మీరు ఎన్ని రోజులు ఆఫ్​లైన్​లో మెసేజ్​లు చూడాలని అనుకుంటున్నారో, అన్ని రోజులను సెట్​ చేసుకోవచ్చు.

అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం- చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ వాయిదా

ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీ- గంటకు 193 కి.మీ వేగంతో ప్రయాణం- ఎంత మంది వెళ్లొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.