ETV Bharat / science-and-technology

ఇలా చేస్తే మీ ఆన్​లైన్ లావాదేవీలు సురక్షితం! - పబ్లిక్ వైఫై ద్వారా లావాదేవీలు జరపడం సురక్షితమేనా

ఇటీవలి కాలంలో కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు ఆన్​లైన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వల్ల గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆన్​లైన్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అంతే స్థాయిలో సైబర్​ నేరాలకు అవకాశాలు పెరిగాయి. మరి మీరు ఆన్​లైన్​ లావాదేవీలు జరిపేటప్పుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సందర్భాల్లో ఆన్​లైన్​ లావాదేవీలు చేయకపోవడమే ఉత్తమం అనే వివరాలు మీ కోసం.

author img

By

Published : Mar 10, 2021, 7:34 AM IST

Updated : Mar 10, 2021, 12:00 PM IST

దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతోంది. కరోనా వల్ల గతేడాది భౌతికంగా నగదు చెల్లింపులు.. తగ్గి డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. లాక్​డౌన్ సమయంలోనైతే ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. బిల్లులు చెల్లించేందుకు, వస్తువుల కొనుగోలుకు చాలా మంది ఆన్​లైన్ ద్వారానే చెల్లింపులు జరిపారు.

మహమ్మారి వల్ల డిజిటల్ వేదికల వినియోగం వేగవంతమైంది. అదే విధంగా సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసేటప్పుడు పూర్తి అప్రమత్తతతో ఉండాలి. సురక్షితమైన వేదికలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులు చేసే వారైనా లేదా కొత్తగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నా.. ప్రతి సారి ఆన్​లైన్ చెల్లింపులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.

ఉచిత వైఫైతో జాగ్రత్త..

రెస్టారెంట్లు, బస్ స్టాండ్లు, హోటళ్లు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం ఉచిత వైఫై సౌకర్యం లభిస్తోంది. మొబైల్​నెట్​వర్క్ లేకపోవటం వల్ల, వేగంగా ఇంటర్నెట్ లభిస్తుందనే కారణాలతో చాలా మంది వీటికి కనెక్ట్ చేసుకుని వాడుతుంటారు.

అయితే పబ్లిక్ వైఫైలో సెక్యూరిటీ అంతగా ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల హ్యాకర్స్​కి ఇవి లక్ష్యాలుగా మారుతుంటాయని వారు చెబుతున్నారు. ఈ కారణంగా పబ్లిక్ వైఫై వాడితే.. ఎలాంటి లావాదేవీలు జరపకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. కచ్చితంగా వాడల్సి వస్తే మాత్రం వీపీఎన్​ ఉపయోగించడం కాస్త సురక్షితమంటున్నారు.

క్లిష్టమైన పాస్​వర్డ్​, ఓటీపీ..

పాస్​వర్ట్ ఖచ్చితంగా క్లిష్టంగా ఉండేలా చూసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోని వై-ఫై విషయంలో కూడా ఇతరులు కనుక్కోలేనంత క్లిష్టంగా పాస్​వర్డ్ పెట్టుకోవాలంటున్నారు.

ఆన్​లైన్ చెల్లింపుల విషయంలో పాస్​వర్డ్ బదులు వన్​టైమ్ పాస్​వర్డ్ ఉపయోగించుకోవటం వల్ల సెక్యూరిటీ పెరుగుతుందని సూచిస్తున్నారు సైబర్​ నిపుణులు. వన్​టైమ్ పాస్​వర్డ్​లు ఒకే సారి ఉపయోగపడే విధంగా ఉండటం సహా రిజిస్టరైన మొబైల్ ద్వారా వాటిని పొందవచ్చు. అయితే పాస్​వర్డ్ లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకవేళ వేరే వాళ్లతో పంచుకున్నట్లయితే మోసాల బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ.

ఇప్పుడు కొనుగోలు.. తర్వాత చెల్లింపు

ఆన్​లైన్ షాపింగ్​లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపటం సర్వ సాధారమైంది. అయితే ఈ మధ్య కొనుగోలు చేసేందుకు వీలుగా తర్వాత చెల్లించే ఆప్షన్ అందుబాటులోకి వస్తోంది. ఇందులో వస్తువులు ఇప్పుడు కొనుగోలు చేసి.. కొన్ని రోజుల తర్వాత చెల్లించవచ్చు. దీనివల్ల బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉండదు. ఇందులో థార్డ్​పార్టీ పేమెంట్ గేట్​వేల అవసరం ఉండదు కాబట్టి సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

అనుమానాస్పద సైట్లను ఉపయోగించవద్దు.

ఇంటర్నెట్​లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఆకట్టుకునే విధంగా ఉన్న సైట్లకు సంబంధించిన వైబ్​సైట్లు పాపప్​ల ద్వారా తెరుచుకుంటుంటాయి. ఈ సైట్లలో పేమెంట్స్ చేయటం ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కంప్యూటర్​ కూడా వైరస్ బారిన పడవచ్చు. అంతేకాకుండా వ్యక్తిగత సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డేటా భద్రంగా ఉండాలంటే సురక్షితమైన, విశ్వసనీయమైన వైబ్​సైట్లు, పేమెంట్ గేట్ వేలను మాత్రమే ఉపయోగించాలి.

సెక్యూరిటీ..

ఏదైనా వెబ్​పేజీ సురక్షితమో కాదో ఆ వెబ్​పేజీ అడ్రస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వైబ్​సైట్ అడ్రస్​లో హెచ్​టీటీపీఎస్ అని ఉంటే అది సురక్షితం అన్నట్లు. హెచ్​టీటీపీఎస్ లేని వైబ్​సైట్లు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. వెరిఫై కానీ లింక్​ల ద్వారా బ్యాంక్​ అకౌంట్ల సమాచారం ఇవ్వటం, చెల్లింపులు చేయటం ద్వారా స్పై వేర్ కంప్యూటర్ లోకి చొరబడే ప్రమాదం ఉంటుంది.

వెబ్​సైట్ అడ్రస్ పక్కకు తాళం సింబల్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. వెబ్​సైట్ డేటా ఎన్​క్రిప్షన్ కోసం ఎస్ఎస్ఎల్ లేదా టీఎల్ఎస్ ఉపయోగించుకుంటుందనేది ఈ రెండింటి ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి:ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?

Last Updated : Mar 10, 2021, 12:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.