Flipkart Republic Day Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 14, రెడ్మీ నోట్ 13ప్లస్ సహా, పలు స్మార్ట్ఫోన్లపై మంచి డీల్స్ అందిస్తోంది. వాటిలోని టాప్-5 డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
IPhone 15 Offers : ఐఫోన్ 15 అసలు ధర రూ.79,900 ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఏకంగా 17 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అంటే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 15ను మీరు కేవలం రూ.65,999కే దక్కించుకోవచ్చు. దీని వల్ల మీకు రూ.13,901 ఆదా అవుతుంది. అంతేకాదు ఈ ఐఫోన్ 15పై బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తాయి. కనుక దీనిని మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
IPhone 14 Offers : మార్కెట్లో ఐఫోన్ 14 ధర రూ.69,900 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 17 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పైగా దీనిపై బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తాయి. వీటన్నింటినీ ఉపయోగించుకుంటే ఈ సేల్‌లో ఐఫోన్ 14ను కేవలం రూ.54,990లకే దక్కించుకోవచ్చు. ఇది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.
Redmi Note 13 Pro+ Offers : ఇటీవలే లాంఛ్ అయిన రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (8జీబీ+256జీబీ) ధర రూ.31,999 వరకు ఉంటుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి దీనిని కొంటే, ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.2000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద అదనంగా మరో రూ.2000 తగ్గిస్తుంది. ఇది మంచి డీల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Nothing Phone 2 Offers : మార్కెట్లో నథింగ్ ఫోన్ ధర రూ.44,999 వరకు ఉంటుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నథింగ్ ఫోన్ 2పై రూ.12,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. పైగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో దీనిని కొంటే రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు రూ.3000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అంటే దీనిని రూ.27,999కే సొంతం చేసుకోవచ్చు.
Asus Rog Ally Offers : మార్కెట్లో ఈ ఆసుస్ రోగ్ అల్లీ ఫోన్ ధర రూ.69,990 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.10,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు వాడి దీనిని కొనుగోలు చేస్తే, అదనంగా మరో రూ.1500 తగ్గుతుంది. ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనిని రూ.58,490కే కొనుగోలు చేయవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.8 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!