ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రావియా.. సరికొత్త స్మార్ట్ టీవీలను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 4కే అల్ట్రాహెచ్‌డీ ఎల్ఈడీ తెరతో ఎక్స్80జే(X80J) సిరీస్‌లో విడుదల చేసింది. ఇవి 43 నుంచి 75 అంగుళాల డిస్ప్లేతో వస్తున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 65 అంగుళాల టీవీనే అందుబాటులోకి తెచ్చిన సోనీ మిగతా వాటిని కూడా అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.
ఈ మోడల్లో రావాల్సిన వేరియంట్ల ధరలను సోనీ అధికారికంగా విడుదల చేయలేదు. 65 అంగుళాల మోడల్ సోనీ బ్రావియా కేడీ-65ఎక్స్80జే ధర సుమారు రూ. 1.3 లక్షలు ఉండొచ్చు అని సమాచారం. ఏప్రిల్ 9నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్లలో, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఇ-కామర్స్ పోర్టల్లలో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది.
ఫీచర్లు...
- 75,65,55,50,43 అంగుళాల్లో లభ్యం
- ఎక్స్1 4కేహెచ్‌డీఆర్ ప్రాసెసర్
- ట్రిలుమినోస్ ప్రో డిస్ప్లే
- ఇన్‌బిల్ట్‌గా గూగుల్ అసిస్టెంట్, గూగుల్ టీవీ
- వాయిస్ కమాండ్లు వినడానికి ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్లు
- యాపిల్ హోం కిట్, ఎయిర్ ప్లే సపోర్ట్
- బ్యాలెన్స్డ్ స్పీకర్ ఫీచర్
- ఆండ్రాయిడ్ ఓఎస్
- ఎల్ఈడీ స్క్రీన్
ఇదీ చూడండి: సినిమా, గేమింగ్ కోసం ఎల్జీ కొత్త టీవీ