ETV Bharat / science-and-technology

Facebook Subscription Plan News : త్వరలో.. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్​.. ఆ యూజర్లకు మాత్రమే! - facebook user base

Facebook Subscription Plan News In Telugu : సోషల్ మీడియా దిగ్గజం మెటా.. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి యాడ్​లు లేకుండా ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ఉపయోగించాలంటే, కచ్చితంగా మంత్లీ సబ్​క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Instagram subscription plan news
Facebook Subscription Plan News
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 1:08 PM IST

Facebook Subscription Plan News : ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్​ న్యూస్​. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

యాడ్​-ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ :
Instagram Ad Free Subscription : మెటా సంస్థ.. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ యూజర్లపై 14 డాలర్ల వరకు యాడ్​-ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీ విధించవచ్చు అని వాల్​స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మెటా అధికారులు ఇప్పటికే ఈ విషయం గురించి ఐర్లాండ్​, బ్రస్సెల్స్, ఈయూ ప్రైవసీ రెగ్యులేటర్​లతో చర్చించారని వెల్లడించింది.

గేట్ కీపర్స్​!
EU Gatekeeper Companies : యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్స్​ యాక్ట్​ తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి మెటా కంపెనీకి 'గేట్​ కీపర్స్'​ స్టేటస్​ను ఇచ్చింది. వాస్తవానికి ఈయూ తీసుకువచ్చిన ఈ డిజిటల్ మార్కెట్స్​ యాక్ట్​ ప్రకారం, కంపెనీలు యూజర్ల డేటాను.. తమ ఇతర సర్వీసులతో, ఇతర కంపెనీలతో పంచుకోకూడదు. అలాగే యూజర్ల అనుమతి లేకుండా వారిపై ఎలాంటి ఇతర పరిమితులు విధించకూడదు.

ప్రస్తుతం అమెరికాకు చెందిన టెక్​ దిగ్గజాలు..యూరోప్​ మార్కెట్​లోనూ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు, పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు ఈయూ సరికొత్త డిజిటల్​ మార్కెట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అంటే యూరోపియన్​ యూజర్ల ప్రయోజనాలను రక్షించే దిశగా చర్యలు చేపట్టింది.

యూరోపియన్ యూజర్లకు మాత్రమే!
Meta Subscription Plan For Europe : వాల్​స్ట్రీట్​ జర్నల్ ప్రకారం, ప్రస్తుతానికి యూరోపియన్ యూజర్లకు మాత్రమే ఈ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​లను అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డెస్క్​టాప్​లో వాడే ఫేస్​బుక్​ లేదా ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్లకు..​ నెలవారీ సబ్​స్క్రిప్షన్​ కింద 10 యూరోలు లేదా 10.46 డాలర్లు ఛార్జీ విధించవచ్చు. ఒక వేళ యూజర్లకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే.. ఒక్కో అదనపు ఖాతాకు 6 డాలర్ల చొప్పున సబ్​స్క్రిప్షన్ ఛార్జీ విధించే అవకాశం ఉంది.

వాల్​స్ట్రీట్ జర్నల్ ప్రకారం, మొబైల్​లో వాడే ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్లపై దాదాపు 13 యూరోల వరకు సబ్​స్క్రిప్షన్ ఛార్జీ విధించే అవకాశం ఉంది. ఎందుకంటే.. యాపిల్, గూగుల్​ యాప్​ స్టోర్స్ వసూలు చేసే కమీషన్​ కూడా ఈ రుసుములో కలిసి ఉంటుంది.

త్వరలోనే!
మెటా కంపెనీ త్వరలోనే ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్లను తీసుకురానుంది. అయితే ప్రకటనలు వచ్చినా ఫర్వాలేదు అనుకునే వారు ఎలాంటి సబ్​స్క్రిప్షన్ లేకుండానే ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లను ఉపయోగించుకోవచ్చు. అప్పుడు వారికి పర్సనలైజ్డ్​ ఎడ్వర్టైజ్​మెంట్స్​ వస్తాయి. ఒక వేళ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్ తీసుకుంటే.. వారికి ఎలాంటి ప్రకటనలు రావు.

ఉచిత సేవలకే ఓటు!
Facebook App Free Service Plan : ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ వేదికల్లో.. ఉచిత సేవలను అందించడానికే మెటా కంపెనీ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, ఆ కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. అయితే ఆయా దేశాల రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా భిన్నమైన సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లను, ఉచిత సర్వీసులను అందించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

భారీ యూజర్ బేస్​!
Facebook User Base : 2023వ సంవత్సరం మొదటి అర్థ భాగం నాటికి 258 మిలియన్​ల మంత్లీ ఫేస్​బుక్ యూజర్లు ఉన్నారు. అలాగే 257 మిలియన్ల మంత్లీ ఇన్​స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతానికి సబ్​స్క్రిప్షన్ ప్లాన్ అనేది యూరోప్​కు మాత్రమే పరిమితం అయినప్పటికీ.. భవిష్యత్​లో దానిని మిగతా దేశాలకు ​కూడా విస్తరించే అవకాశం ఉంటుందని టెక్​ నిపుణులు భావిస్తున్నారు.

Upcoming Smartphones October 2023 : క్రేజీ ఫీచర్స్​తో.. లాంఛ్​కు సిద్ధమవుతున్న బెస్ట్ స్మార్ట్​ఫోన్స్ ఇవే!

How To Read Deleted Messages On WhatsApp : వాట్సాప్​లో డిలీట్​ అయిన మెసేజ్​లను చదవాలా?.. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.