ETV Bharat / science-and-technology

గూగుల్​, ఫేస్​బుక్​కు థరూర్​ కమిటీ హెచ్చరిక!

author img

By

Published : Jun 29, 2021, 5:59 PM IST

Updated : Jun 29, 2021, 10:56 PM IST

కొత్త ఐటీ నిబంధనలను తప్పక పాటించాలని గూగుల్, ఫేస్​బుక్​కు స్పష్టం చేసింది పార్లమెంటరీ కమిటీ. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు థరూర్ కమిటీ సభ్యులు ఈమేరకు తేల్చిచెప్పారు.

social media misuse
ఫేస్​బుక్

నూతన ఐటీ నిబంధనలు, కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని గూగుల్​, ఫేస్​బుక్​కు పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. శశి థరూర్ నేతృత్వంలో ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన ఈ కమిటీ.. ఆ సంస్థల ప్రతినిధులను మంగళవారం అనేక అంశాలపై ప్రశ్నించింది. అనంతరం ఈ మేరకు ఆదేశించినట్లు విశ్వనీయవర్గాల సమాచారం.

ఫేస్​బుక్​ తరఫున పబ్లిక్​ పాలసీ డైరెక్టర్​ శివనాథ్​ తుక్రాల్, జెనరల్ కౌన్సెల్ నమ్రత సింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. గూగుల్​ నుంచి కంట్రీ హెడ్ అమన్ జైన్, లీగల్ వ్యవహారాల డైరెక్టర్ గీతాంజలి దుగ్గల్ వచ్చారు.

కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్​ అధికారులను ప్రశ్నించిన కమిటీ.. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాల ప్రతినిధులను కూడా విచారణకు పిలవనుంది.

ఇదీ చూడండి: 'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'

Last Updated : Jun 29, 2021, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.