వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేసే సెర్చ్ ఇంజన్ డక్‌డక్‌గో.. గూగుల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గూగుల్ కొత్తగా ప్రకటించిన ట్రాకింగ్ పద్ధతిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. వినియోగదారుల బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా వారిని ఓ సమూహంలా చేస్తోందని తెలిపింది. అయితే సంబంధిత వెబ్సైట్లు ఆ గ్రూప్ ఐడీ పొంది అక్కడ ఉండే వ్యక్తుల జాబితాను పొందడం, వారి వేలి ముద్రలను తీసుకోవడం లాంటివి చేసే ప్రమాదముందని వెల్లడించింది.
వినియోగదారుల అవసరాలను, వారు కోరుకునే వాటిని, ఏ సమయంలో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు.. ఇలా అన్ని కార్యకలాపాలను ట్రాక్ చేసి అందుకు సంబంధిత ప్రకటనలను అందిచడానికి గూగుల్ ఎఫ్‌ఎల్‌ఓసీ(పెడరేటేడ్ లెర్నింగ్ ఆఫ్ కోహోర్ట్స్) తీసుకుచ్చింది. అయితే ఒకసారి గూగుల్ దీన్ని అందుబాటులోకి తీసుకువస్తే దాని ప్రభావం కనీసం కొన్ని మిలియన్ల మందిపై పడనుంది.
"గూగుల్ కొత్త ట్రాకింగ్ పద్ధతిలో మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుంది. మీరు ఆశ్యర్యపోవచ్చు. ఇది నిజం. మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మీకు వ్యక్తిగత ప్రకటనలు వెలువడుతాయి. మీ సమాచారం అంతా సంబంధిత గ్రూప్‌లో నిక్షిప్తమై ఉంటుంది."
- డక్‌డక్‌గో సంస్థ
ఈ క్రమంలో గూగుల్ క్రోమ్‌ను ఉపయోగించవద్దని డక్‌డక్‌గో తెలిపింది. ప్రస్తుతం ఎఫ్‌ఎల్‌ఓసీ గూగుల్ క్రోమ్‌లో మాత్రమే ఉందన్న సంస్థ వినియోగదారులు ఇతర బ్రౌజర్లను ఉపయోగించాలని సూచించింది.
ఇవీ చూడండి: