ETV Bharat / science-and-technology

ఆ మెసేజ్​లతో జాగ్రత్త.. క్లిక్​ చేస్తే ఖాతా ఖాళీనే! - సీఈఆర్​టీ-ఇన్​

ఎన్​గ్రాక్​ వేదికను ఉపయోగించుకుని సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా ఫిషింగ్​ దాడులకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్​టీ-ఇన్​ హెచ్చరించింది.

Cyber crimes
సైబర్​ మోసాలు
author img

By

Published : Aug 13, 2021, 11:17 AM IST

సైబర్​ నేరగాళ్లు పూటపూటకూ పంథా మారుస్తున్నారు. జేబులు చిల్లు చేసేందుకు అన్ని మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా మరో స్కామ్​ బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్​టీ-ఐఎన్​(కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​-ఇండియా) హెచ్చరించింది(cert-in advisory). భారతీయ బ్యాంకింగ్​ వినియోగదారులే లక్ష్యంగా ఈ సైబర్​ దాడులు జరుగుతున్నట్టు పేర్కొంది.

సైబర్​ నేరగాళ్లు ఈసారి ఎన్​గ్రాక్​ వేదికను ఉపయోగించుకుని ఫిషింగ్​ దాడులకు(phishing attack) పాల్పడుతున్నారు. తమని తాము బ్యాంకింగ్​ అధికారులుగా పరిచయం చేసుకుని వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ వివరాలు, ఓటీపీ, ఫోన్​నెంబర్​ వంటి అత్యంత గోప్యతతో కూడిన విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు.

"ఎన్​గ్రాక్​ వేదికగా.. భారతీయ బ్యాంకింగ్​ కస్టమర్లపై సైబర్​ నేరగాళ్లు ఫిషింగ్​ దాడులకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ పోర్టళ్ల తరహాలో కొన్ని వెబ్​సైట్లను రూపొందిస్తున్నారు. వీటిని ఉపయోగించుకుని కస్టమర్ల దగ్గర నుంచి అత్యంత గోప్యమైన వివరాలను సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి" అని సీఈఆర్​టీ సూచించింది.

ఎలా చేస్తారు?

వినియోగదారులకు.. ఫిషింగ్​ లింక్స్(చివర్లో ngrok.io. అని ఉంటుంది)​తో కూడిన మెసేజ్​ వెళుతుంది. 'ప్రియమైన వినియోగదారులారా.. మీరు మీ కేవైసీని అప్డేట్​ చేసుకోలేదు. చేసుకోకపోతే మీ XXX బ్యాంకు ఖాతా సస్పెండ్​ అవుతుంది. వెంటనే కేవైసీని అప్డేట్​ చేసుకోండి. అందుకోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి" అని మెసేజ్​లో ఉంటుంది. ఇలాంటి మెసేజ్​లు చూసి వినియోగదారులు ఆందోళన చెందడం సహజం. ఎవరి నుంచి వచ్చిందో కూడా చూడకుండా లింక్​ క్లిక్​ చేస్తూ ఉంటారు. ఖాతా నిజంగానే సస్పెండ్​ అవుతుందేమో అనుకుని భయపడుతూ ఉంటారు.

యూఆర్​ఎల్​ మీద క్లిక్​ చేసినప్పుడు.. ఇంటర్నెట్​ బ్యాంకింగ్ సైట్​ను పోలి ఉన్న​ ఫిషింగ్​ వెబ్​సైట్ ఓపెన్​ అవుతుంది. వినియోగదారుల లాగిన్​ వివరాలు అడుగుతుంది. ఓటీపీ కూడా ఫోన్​కు వెళుతుంది. వినియోగదారుడు ఆ ఓటీపీని వెబ్​సైట్​లో పెడతాడు. ఇక్కడే సైబర్​ నేరగాళ్లకు చిక్కుతాడు. నేరగాళ్లు అక్రమ లావాదేవీలకు పాల్పడతారు.

ఇలాంటి మెసేజ్​లు, ఈ-మెయిళ్లతో జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్​టీ-ఇన్​ సూచించింది. ఈ క్రమంలో నిజమైన బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్​లు, ఫిషింగ్​ దాడుల్లో వచ్చే మెసేజ్​ల మధ్య ఉన్న తేడాలను వివరించింది.

  • సాధారణంగా బ్యాంకులు పంపే మెసేజ్​లలో సెండర్​ ఐడీ ఉంటుంది. అయితే ఈ సైబర్​ నేరగాళ్లు పంపే మెసేజ్​లలో ఐడీ కాకుండా ఓ ఫోన్​ నెంబర్​ ఉంటుంది.
  • రెండు మెసేజ్​లలో వాడే భాషను కూడా గమనించాలి. సైబర్​ నేరగాళ్లు పంపే మెసేజ్​లలో వ్యాకరణ దోషాలు ఉంటాయి. అసలు ఫార్మాట్​ కూడా సరిగ్గా ఉండదు. ఇలాంటి మెసేజ్​లు ఏ బ్యాంకు కూడా పంపదు.
  • ఈ మెయిల్స్​ ఓపెన్​ చేసేడప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే బ్యాంకుకు వెంటనే ఫోన్​ చేయండి.

ఇదీ చూడండి:- ఈ ఏడు టిప్స్​తో మీ నెట్​ బ్యాంకింగ్ సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.