apple app store: డేటా భద్రత విషయంలో యాపిల్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్లను థర్డ్ పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనుమతించదు. యూజర్‌కు అవసరమైన ఏ యాప్ అయినా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఇంత కఠినంగా వ్యవహరించే యాపిల్ యాప్ స్టోర్‌లో కొన్ని స్కామ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు సుమారు 100 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినట్లు సమాచారం. దీంతో ఐఫోన్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. వెంటనే సదరు యాప్‌లను తొలగించమని సూచించాయి. ఇప్పటి వరకు ఈ యాప్‌లకు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నట్లు చెబుతున్నాయి. మరి, సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్న స్కామ్ యాప్‌లు ఏంటి? వాటిని తొలగించేందుకు యాపిల్ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూద్దాం..
స్కామ్ యాప్స్:
- గతేడాది మార్చిలో యాపిల్ యాప్ స్టోర్‌లోని 133కు పైగా యాప్స్ స్కామింగ్‌కు అనుకూలమైనవి అవాస్ట్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వెంటనే వాటిని యాప్ స్టోర్ నుంచి తొలగించమని యాపిల్‌కు సూచించింది.
- తాజాగా యాప్ స్టోర్‌లో వీపీఎన్ చెక్ జరిపిన రివ్యూలో ఇంకా 84 స్కామింగ్ యాప్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వీటిలో ఫ్లీసీవేర్ ఉన్నట్లు వీపీఎన్ చెబుతోంది.
- ఫ్లీసీవేర్ మాల్‌వేర్ కాదని, యూజర్‌కు ఫ్రీ ట్రయల్ ఆశ చూపి, మొబైల్‌లో ప్రవేశించి వారి ప్రమేయం లేకుండా యాపిల్ ఖాతాల నుంచి ఫీజు రూపంలో పెద్ద మొత్తంలో నగదు కాజేస్తుందట. ఈ స్కామ్ యాప్‌ల ద్వారా నెలకు సుమారు 8.6 మిలియన్ డాలర్లు ఐఫోన్ యూజర్ల నుంచి కాజేసినట్లు సమాచారం.
గుర్తించడమెలా..?
- ఫ్లీసీవేర్ స్కామ్‌లో ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ఉన్నాయట. వర్చువల్ మ్యూజిక్ టూల్స్, ఫ్లాష్‌లైట్స్, కాలిక్యులేటర్, ఫొటో/వీడియో ఫిల్టర్స్, సౌండ్ బూస్టర్స్, క్విజ్ ఆధారిత గేమ్స్, వాల్‌పేపర్స్, జాతకం చెప్పే వంటి యాప్స్ మెదటి కేటగిరిలో ఉండగా, రెండో కేటగిరిలో వరదల సహాయానికి సంబంధించి నకిలీ రేటింగ్, రివ్యూలతో కొన్ని యాప్‌లు ఉన్నట్లు గుర్తించారు.
- ఈ యాప్‌లను యాప్ స్టోర్ నుంచి తొలగించేందుకు యాపిల్ పటిష్ఠమైన చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
- ఈ యాప్‌లు ఇప్పటికీ యాప్ స్టోర్‌లో యూజర్లకు అందుబాటులో ఉండటంపై సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- యాపిల్ యూజర్లు ఈ యాప్‌లు తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయమని సూచిస్తున్నాయి.
ఇవీ చదవండి: ప్లేస్టోర్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా.. ముందు వీటిని చెక్ చేసుకోండి!
ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్..