Boat Smart Ring : భారతీయ కంపెనీ బోట్ తాజాగా సరికొత్త స్మార్ట్ రింగ్‌ను ఆవిష్కరించింది. చేతి వేలికి ధరించే ఈ స్మార్ట్ పరికరంతో మీ ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని (ఫిట్నెస్)ను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ చెబుతోంది.
ప్రీమియం లుక్‌తో..
Boat smart ring fitness tracker : సెరామిక్, మెటల్ మెటీరియల్‌తో చేసిన ఈ స్మార్ట్ రింగ్ చూడడానికి మంచి ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీనితో మీ హార్ట్ రేటు, ఎస్పీO2 ట్రాకింగ్, స్లీప్ మోనిటరింగ్ చేసుకోవచ్చు. మొత్తంగా మీ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఈ బోట్ స్మార్ట్ రింగ్‌తో.. మీ శరీర ఉష్ణోగ్రతను కొలవవచ్చు. స్మార్ట్ వాచ్‌లో లాగా ఈ స్మార్ట్ రింగ్‌తో కూడా మీరు నడుస్తున్నప్పుడు, పరుగెడుతున్నప్పడు స్టెప్లను ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే వర్కౌంట్స్ చేస్తున్నప్పుడు ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యింది కూడా తెలుసుకోవచ్చు.
Boat smart ring for woman : మహిళల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ రింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రుతుచక్రం ట్రాక్ చేయడానికి లేదా ప్రిడిక్ట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడతుంది.
వాటర్ ప్రూఫ్‌తో..
Boat smart ring features : బోట్ స్మార్ట్ రింగ్ 5ఏటీఎం ప్రెజర్ వరకు వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అలాగే చెమట నుంచి కూడా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అందువల్ల నీటిలో ఈత కొట్టినా, హెవీ వర్కౌంట్ చేసినా, ఈ స్మార్ట్ పరికరానికి ఏమీ కాదు.
అదిరిపోయే యూజర్ ఎక్స్పీరియన్స్
Boat smart ring health tracker : ఈ బోట్ స్మార్ట్ రింగ్ మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ రింగ్‌ను బోట్ రింగ్ యాప్‌తో సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ సహాయంతో మీ హెల్త్ డేటాను విజువల్ రూపంలో ట్రాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ యాక్టివిటీస్, హెల్త్ ట్రాక్, ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
పోటాపోటీగా..
Boat smart ring vs Samsung health tracker : శాంసంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బోట్ కంపెనీ తన బ్రాండ్‌తో స్మార్ట్ రింగ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్కెట్లో స్మార్ట్ రింగ్‌లకు ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది.
ధర ఎంతంటే?
Boat smart ring price : బోట్ స్మార్ట్ రింగ్ స్పెసిఫికేషన్స్, ధర, విడుదల తేదీ గురించి ఇప్పటి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఇప్పటి వరకు ఈ కంపెనీవారు తమ ప్రొడక్టులన్నింటినీ బడ్జెట్ రేంజ్‌లోనే తీసుకువచ్చారు. కనుక ఈ బోట్ స్మార్ట్ రింగ్‌ను కూడా అందుబాటు ధరలోనే తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒకసారి లాంఛ్ అయిన తరువాత ఈ బోట్ స్మార్ట్ రింగ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా బోట్ ఆన్లైన్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
బడ్జెట్ ధరల్లోనే!
boat products : ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ ఇప్పటి వరకు సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా.. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. వీటికి వినియోగదారుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. అందుకే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్‌లో ఉన్న స్మార్ట్ రింగ్‌లపై బోట్ కంపెనీ దృష్టి సారించింది.