గత కొంత కాలంగా ఫిట్నెస్ ట్రాకర్స్ లేదా స్మార్ట్ బ్యాండ్స్(Smart band) ఉపయోగం చాలా పెరిగింది. బడ్జెట్ ధరల్లో ఫిట్నెస్ ట్రాకర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లో పలు కంపెనీలు బ్యాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
భారత్‌లో షియోమీ, హానర్, అమేజ్‌ఫిట్.. ఇలా పలు బ్రాండ్లు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. ప్రీమియం ఫోన్లు తయారీ కంపెనీ వన్ ప్లస్ కూడా ఫిట్నెస్ బ్యాండ్‌ను విడుదల చేసింది.
స్మార్ట్ బ్యాండ్లు కేవలం ఫిట్నెస్ను ట్రాకింగ్ చేయటమే కాకుండా నిద్ర నాణ్యత, హృదయ స్పందనను మానిటర్ చేయటం, ఫోన్ నోటిఫికేషన్స్‌ను చూపించటం లాంటివి చేస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
మరి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్, బడ్జెట్ స్మార్ట్ బ్యాండ్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఎంఐ స్మార్ట్ బ్యాండ్
ఫిట్నెస్ బ్యాండ్లలో అందుబాటు ధరల్లో మంచి బ్యాండ్ ఇది. డిస్ప్లే, హృదయ స్పందన ట్రాకింగ్, అప్డేటెడ్ ఛార్జింగ్ సెటస్, బరువు తక్కువ ఉండటం, మంచి బ్యాటరీ లైఫ్ ఈ బ్యాండ్‌కు అనుకూలతలు.
ఫీచర్లు
- 1.1 అంగుళాల ఆమోలోడ్ డిస్ప్లే
- కంపాటిబిలిటీ: ఐఓఎస్, ఆండ్రాయిడ్
- బ్యాటరీ: 14 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0 ఎల్ఈ
- ఎస్పీ O2: లేదు
- ధర : రూ 2,499
హనర్ బ్యాండ్ 6
ఇది హానర్ వాచ్ ఈఎస్‌ను పోలి ఉంటుంది. కానీ వాటితో పోల్చితే.. డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. డిజైన్ పరంగా చూసుకుంటే తక్కువ బరువు ఉంటుంది. జీపీఎస్ లేమి, స్లీప్ ట్రాకింగ్‌లో లోపాలు ఈ బ్యాండ్ మైనస్ పాయింట్లని చెప్పుకోవచ్చు.
ఫీచర్లు
- 1.47 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే
- కంపాటిబిలిటీ : ఐఓఎస్, ఆండ్రాయిడ్
- బ్యాటరీ: 14 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎమ్ వాటర్ ప్రూఫ్
- ఎస్పీ O2 : ఉంది.
- ధర : రూ. 3,999
ఒప్పో బ్యాండ్ స్టైల్
ఇందులో డిస్ ప్లే, స్పోర్ట్స్ మోడ్లు దీనికి అనుకూల అంశాలు. ఎస్పీ O2 కూడా దీనికి అదనపు ఆకర్షణ. బ్యాటరీ లైఫ్ మరీ మంచి స్థాయిలో లేదని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని కొనుగోలు చేసినప్పుడు అదనపు స్ట్రాప్ కూడా లభిస్తుంది.
ఫీచర్లు
- 1.1 అంగులాల ఆమోల్డ్ డిస్ప్లే
- బ్యాటరీ సామర్థ్యం: 6-10 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్
- ఎస్పీ O2 : ఉంది
- ధర : రూ. 2,799
శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 2
డిస్ప్లే, స్లిమ్ డిజైన్, తక్కువ బరువు దీని ఆకర్షణీయతలు. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా లేదు. ఐఫోన్ సపోర్ట్ కూడా లేకపోవటం దీనికి ప్రతికూల అంశాలు. ఇందులో 90 వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఉపయోగపడేలా హ్యాండ్ వాష్ రిమైండర్ లాంటి ఫీచర్ ఈ బ్యాండ్‌లో ఉంది.
ఫీచర్లు
- 1.1 అంగుళాల ఆమోలోడ్ డిస్ప్లే
- కంపాటిబిలిటీ: ఆండ్రాయిడ్
- బ్యాటరీ సామర్థ్యం: 15 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- కనెక్టివిటీ: బ్లూటూత్ 5
- ఐపీ రేటింగ్: 5 ఏటీఎం స్విమ్ ప్రూఫ్
- ఎస్పీఓ 2 : లేదు
- ధర : రూ. 3,999
రెడ్ మీ స్మార్ట్ బ్యాండ్
ఎంఐ బ్యాండ్లను కంటే తక్కువ ధరలో రెడ్ మీ బ్రాండ్ ద్వారా ఈ బ్యాండ్లను అందుబాటులోకి తెచ్చింది షియోమీ. ధర తక్కువగా ఉండటం, బరువు తక్కువగా ఉండటం, హార్ట్ రేట్ మానిటరింగ్, ఇతర ట్రాకింగ్ సరిగా ఉండటం దీనిలో ఆకర్షణీయ అంశాలు. టచ్ సరిగా లేకపోవటం, బ్యాటరీ లైఫ్ మారుతుండటం లాంటివి ప్రతికూల అంశాలు.
ఫీచర్లు
- డిస్ ప్లే :1.08 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- కంపాటిబిలిటీ : ఐఓఎస్, ఆండ్రాయిడ్
- బ్యాటరీ సామర్థ్యం: 7 రోజులు (ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే)
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5
- ఐపీ రేటింగ్ : 5 ఏటీఎం స్విమ్ ప్రూఫ్
- ఎస్పీ O2 : లేదు.
- ధర : రూ.1,599
ఇవీ చదవండి: