ETV Bharat / science-and-technology

అద్భుత 'సెల్ఫీ' కెమెరాతో మంచి స్మార్ట్​ఫోన్లు- బడ్జెట్​ ధరలోనే.. - vivo y73

Best Selfie Camera Smartphones: స్మార్ట్‌ఫోన్‌ అనగానే ఎక్కువ మంది ఆసక్తి కనబరిచే ఫీచర్‌ సెల్ఫీ కెమెరా. బంధుమిత్రులతో పార్టీ అయినా, కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీలు దిగడం అలవాటు. మరికొంతమంది ఔత్సాహికులు తమకు నచ్చిన అంశాలతో సెల్ఫ్‌ వీడియోలు తీస్తూ వ్లాగింగ్ కూడా చేసేస్తున్నారు. గతంలో అయితే ఇందుకోసం డిఎస్‌ఆర్‌ఎల్ కెమెరాలు లేదా గో ప్రో వంటి చిన్న కెమెరాలు ఉపయోగించేవారు. ఇప్పుడు అధిక పిక్సెల్స్‌ సామర్థ్యం కలిగిన కెమెరాలు మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండటంతో వాటినే వినియోగిస్తున్నారు. మరి అలాంటి మంచి సెల్ఫీ కెమెరాలతో వస్తున్న ఫోన్లేంటో ఓ లుక్కేద్దామా..?

best-selfie-camera-smartphone
best-selfie-camera-smartphone
author img

By

Published : Feb 6, 2022, 4:51 PM IST

Best Selfie Camera Smartphones: బడ్జెట్​ ధరల్లో అద్భుత సెల్ఫీ కెమెరాతో స్మార్ట్​ఫోన్లు మార్కెట్లో చాలా మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో ఏది బెటర్​. అలాంటి ఫోన్ల ఫీచర్లను ఓసారి చూద్దాం.

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో (Redmi Note 10 Pro)

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇందులో నైట్ మోడ్‌, పనోరమా, బ్యూటిఫై, పొట్రెయిట్‌, షార్ట్ వీడియో, స్లో మోషన్‌, టైమ్‌ లాప్స్‌ వంటి ఫీచర్లున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 5 ఎంపీ సూపర్ మాక్రో, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్‌, 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌ కెమెరాలున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.67 ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 17,999.

వివో వై73 (Vivo Y73)

Best Selfie Camera Smartphones
వివో వై73

ఈ ఫోన్‌లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీనికి అదనంగా నైట్‌, స్డడీ ఫేస్‌, పొట్రెయిట్‌ లైట్‌ ఎఫెక్ట్‌, వీడియో ఫేస్ బ్యూటీ, డ్యూయల్‌-వ్యూ వీడియో వంటి ఫీచర్లున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌ ఫీచర్ కూడా ఉంది. 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమర్స్ కోసం అల్ట్రా గేమ్‌ మోడ్ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 20,990.

వన్‌ప్లస్‌ 9 & 9 ప్రో (Oneplus 9 & 9 Pro)

Best Selfie Camera Smartphones
వన్‌ప్లస్‌ 9 & 9 ప్రో

వన్‌ప్లస్ 9, 9 ప్రో మోడల్స్‌లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో సోనీ ఐఎమ్‌ఎక్స్ 471 సెన్సర్లు ఉపయోగించారు. ఫిక్స్‌డ్ ఆటోఫోకస్‌, ఫేస్ అన్‌లాక్‌, హెడీఆర్‌, స్క్రీన్‌ ఫ్లాష్‌, ఫేస్ రీ-టచింగ్ వంటి ఫీచర్లున్నాయి. ఇక వన్‌ప్లస్‌ 9 ప్రోలో వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 50 అల్ట్రా వైడ్ యాంగిల్‌, 8 ఎంపీ టెలీ ఫొటో, 2 ఎంపీ మాక్రో కెమెరాలున్నాయి. వన్‌ప్లస్ 9లో 8 ఎంపీ టెలీ ఫొటో మినహా మిగిలిన కెమెరాలను ఇస్తున్నారు. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేస్తాయి. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో వన్‌ప్లస్ 9 ప్రోలో 6.7 అంగుళాలు, వన్‌ప్లస్‌ 9లో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65టీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.49,999.

రెడ్‌మీ నోట్‌ 10 లైట్‌ (Redmi Note 10 Lite)

Best Selfie Camera Smartphones
రెడ్‌మీ నోట్‌ 10 లైట్‌

రెడ్‌మీ నోట్ 10 లైట్‌లో పంచ్‌హోల్‌ డిస్‌ప్లేతో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో పనోరమ సెల్ఫీ, పామ్‌ షట్టర్‌, ఏఐ షిల్లౌట్‌ డిటెక్షన్‌, హెచ్‌డీఆర్‌, ఫ్రంట్ ఫేసింగ్ బ్యూటీ, ఏఐ పొట్రెయిట్‌ మోడ్‌, ఏఐ సీన్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ అల్ట్రా హై రిజల్యూషన్‌ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్‌, 5 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరాలున్నాయి. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ‌/128 జీబీ, 6 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999.

వివో వై33ఎస్‌ (Vivo Y33S)

Best Selfie Camera Smartphones
వివో వై33ఎస్‌

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో వివో వై33 ఎస్‌ పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.58 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,990.

రియల్‌మీ 8 (Realme 8)

Best Selfie Camera Smartphones
రియల్‌మీ 8

రియల్‌మీ 8లో ముందు 16 ఎంపీ ఇన్‌-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో పొట్రెయిట్ మోడ్‌, పనోరమిక్‌ వ్యూ, ఏఐ బ్యూటీ మోడ్‌, హెచ్‌డీఆర్‌, ఫేస్‌ రికగ్నిషన్, ఫిల్టర్స్‌, సూపర్ నైట్‌స్కేప్‌ వంటి పీచర్లున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌-యాంగిల్‌, రెండు 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్‌ డార్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ/128 జీబీ, 8 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.15,699.

ఒప్పో ఏ55 (Oppo A55)

Best Selfie Camera Smartphones
ఒప్పో ఏ55

ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ కెమెరాలో టైమ్‌ లాప్స్‌, మాక్రో, స్టిక్కర్‌, పనోరమిక్‌, పొట్రెయిట్, నైట్ వంటి ఫీచర్లున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ఏఐ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.51 అంగుళాల పంచ్‌ హోల్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.15,490.

ఇవే కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్‌, ఎం52, ఒప్పో రెనో 6 ప్రో మోడల్స్‌లో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఇస్తున్నారు. అలానే పైన పేర్కొన్న జాబితాలో వన్‌ప్లస్ మినహా మిగిలిన అన్ని మోడల్స్‌ అందుబాటులో ధరలో ఉన్నాయి.

ఇవీ చూడండి: సరికొత్త ఫీచర్​.. ఇన్​స్టాలో ఇక నెలనెలా సంపాదించుకోవచ్చు..!

ఫోన్​కు మరీ అంతలా అతుక్కుపోతున్నారా? ఈ టిప్స్​ మీ కోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.