Best Laptops Under 30000 : నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్స్, డెస్క్‌టాప్స్, ల్యాప్టాప్స్ లేకుండా జీవితం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తోంది. క్రియేటివ్ ఫీల్డ్ విషయానికి వస్తే, హెవీ గ్రాఫిక్స్‌తో వీడియో ఎడిటింగ్ చేయాల్సి వస్తోంది. హెవీ గేమ్స్ కోసం మంచి కాన్ఫిగరేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్ కావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అన్నీ బెస్ట్ ఫీచర్స్ ఉన్న ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్లోకి తెలుస్తున్నాయి. వాటిలో రూ.30,000 బడ్జెట్లోని టాప్-10 ల్యాప్టాప్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. అంతకంటే ముందు, ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఏయే అంశాలను చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నోట్ : ఇక్కడ చెప్పే అంశాలు రూ.30,000 బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని చెప్పినవి మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
ల్యాప్‌టాప్ కొనేముందు చెక్ చేసుకోవాల్సిన అంశాలు
- ప్రాసెసర్ : మల్టీ టాస్క్‌లు చేయాలంటే ల్యాప్‌టాప్‌లో కచ్చితంగా మంచి ప్రాసెసర్ ఉండాలి. సాధారణంగా రూ.30,000 బడ్జెట్లో వచ్చే Intel Core i3, AMD Ryzen 3 లాంటి మంచి ప్రాసెసర్స్ ఉన్న ల్యాప్‌టాప్స్‌ను ఎంచుకోవాలి.
- ర్యామ్ : ల్యాప్‌టాప్‌లో కనీసం 4జీబీ ర్యామ్ ఉండాలి. వీలైతే ఇంతకు మించిన పవర్ఫుల్ ర్యామ్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మల్టిపుల్ అప్లికేషన్లను మనం సులువుగా హ్యాండిల్ చేయగలుగుతాము.
- స్టోరేజ్ : ల్యాప్‌టాప్‌లో HDD లేదా SSD ఉండేలా చూసుకోవాలి. SSD పెర్ఫార్మెన్స్ స్పీడ్‌గా ఉంటుంది. కానీ HDDతో పోల్చితే, స్టోరేజీ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అందుకే మీ ప్రయారిటీలను అనుసరించి సరైన దానిని ఎంచుకోవాలి.
- బిల్డ్ క్వాలిటీ : ల్యాప్‌టాప్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి. అప్పుడే అది దృఢంగా ఉండి, దీర్ఘకాలంపాటు పని చేస్తుంది.
- ఆపరేటింగ్ సిస్టమ్ : మీ అవసరాలను అనుసరించి విండోస్, క్రోమ్ఓఎస్, లీనక్స్ (Linux) లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ల్యాప్టాప్స్ ఎంచుకోవాలి.
- బ్యాటరీ లైఫ్ : ల్యాప్‌టాప్ కొనేముందు మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న దానినే ఎంచుకోవాలి. అప్పుడే ఎలాంటి అంతరాయాలు లేకుండా పనిచేసుకోగలుగుతాం.
- గ్రాఫిక్స్ : నేటి కాలంలో హెవీ గ్రాఫిక్స్‌తో కూడిన టాస్క్‌లు చేయాల్సి వస్తోంది. కనుక మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ ఎంచుకోవడం మంచిది. లేదంటే నిపుణుల సలహాతో మంచి గ్రాఫిక్ కార్డ్‌ను ల్యాప్‌టాప్‌లో ఇన్స్టాల్ చేయించుకోవాలి.
- బ్రాండ్ రెప్యుటేషన్ : మనం వీలైనంత వరకు మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వాటి పెర్ఫార్మెన్స్ చాలా వరకు బాగుంటుంది. పైగా కస్టమర్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
- రివ్యూస్ : ల్యాప్టాప్స్ కొనేటప్పుడు కచ్చితం యూజర్స్ ఇచ్చిన రివ్యూస్ చదవాలి. దీని ద్వారా సదరు ల్యాప్‌టాప్‌లోని లోటుపాట్లు మనకు తెలుస్తాయి. దీనితో మంచి ల్యాప్‌టాప్ ఎంచుకోవడం మనకు కాస్త సులభమవుతుంది.
Top 10 Laptops Under 30000 : ఇప్పుడు మనం రూ.30,000 బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 ల్యాప్టాప్స్ గురించి తెలుసుకుందాం.
1. Acer One 14 Featrues :
- స్క్రీన్ సైజ్ : 14 అంగుళాలు
- సీపీయూ మోడల్ : రైజెన్ 3 3250యూ ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512 ఎస్ఎస్డీ/ 1టీబీ హెచ్డీడీ
- గ్రాఫిక్ కార్డ్ : ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ కార్డ్
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Acer One 14 Price : మార్కెట్లో ఈ ఏసర్ వన్ 14 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.25,990 ఉంటుంది.
2. Zebronics Pro Series Y Features :
- స్క్రీన్ సైజ్ : 15.6 అంగుళాలు
- సీపీయూ మోడల్ : ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11
Zebronics Pro Series Y Price : మార్కెట్లో ఈ జీబ్రానిక్స్ ప్రో సిరీస్ వై ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.27,990 ఉంటుంది.
3. Asus Vivobook 15 Features :
- స్క్రీన్ సైజ్ : 15.6 అంగుళాలు
- సీపీయూ మోడల్ : సెలెరాన్ ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Asus Vivobook 15 Price : మార్కెట్లో ఈ ఆసుస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.26,990 ఉంటుంది.
4. MSI Modern 15 Features :
- స్క్రీన్ సైజ్ : 40 సెం.మీ
- సీపీయూ మోడల్ : ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
MSI Modern 15 Price : మార్కెట్లో ఈ ఎంఎస్ఐ మోడ్రన్ 15 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.29,990 ఉంటుంది.
5. HP Laptop 15 Features :
- స్క్రీన్ సైజ్ : 39.6 సెం.మీ
- సీపీయూ మోడల్ : సెలెరాన్ ఎన్ ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512జీబీ
- కెమెరా : 720పీ హెచ్డీ కెమెరా
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
HP Laptop 15 Price : మార్కెట్లో ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15 ధర సుమారుగా రూ.27,789 వరకు ఉంటుంది.
6. Lenovo IdeaPad 1 Features :
- స్క్రీన్ సైజ్ : 15.6 అంగుళాలు
- సీపీయూ మోడల్ : అథ్లాన్ సిల్వర్ 3050యూ
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512జీబీ ఎస్ఎస్డీ
- బ్యాటరీ : 42వాట్ బ్యాటరీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Lenovo IdeaPad 1 Price : మార్కెట్లో ఈ లెనోవా ఐడియాప్యాడ్ 1 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.26,990 వరకు ఉంటుంది.
7. Lenova IdeaPad Features :
- స్క్రీన్ సైజ్ : 10.1 అంగుళాలు
- సీపీయూ మోడల్ : సెలెరాన్ ఎన్4020
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజ్ : 512జీబీ ఎస్ఎస్డీ
- బ్యాటరీ : 39 వాట్ బ్యాటరీ
- కెమెరా : ఫ్రంట్ & రియర్ కెమెరా సెటప్
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Lenova IdeaPad : మార్కెట్లో ఈ లెనోవా ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.24,990 వరకు ఉంటుంది.
8. HP 255 Thin and Light Laptop Features :
- స్క్రీన్ సైజ్ : 15.1 అంగుళాలు
- సీపీయూ మోడల్ : రైజెన్ 3 3250యూ ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 512జీబీ ఎస్ఎస్డీ
- గ్రాఫిక్స్ కార్డ్ : ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ కార్డ్
- ఆపరేటింగ్ సిస్టమ్ : డీఓఎస్
HP 255 Thin and Light Laptop Price : మార్కెట్లో ఈ హెచ్‌పీ 255 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.25,999 ఉంటుంది.
9. Dell Latitude 5490 Features :
- స్క్రీన్ సైజ్ : 14 అంగుళాలు
- సీపీయూ మోడల్ : ఇంటెల్ కోర్ ఐ5 ఫ్యామిలీ ప్రాసెసర్
- ర్యామ్ : 16జీబీ
- స్టోరేజ్ : 512జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : 10ప్రో
Dell Latitude 5490 Price : మార్కెట్లో ఈ డెల్ లాటిట్యూడ్ 5490 ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.24,599 ఉంటుంది.
10. Acer Aspire Lite Features :
- స్క్రీన్ సైజ్ : 15.6 అంగుళాలు
- సీపీయూ మోడల్ : ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 256జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Acer Aspire Lite Price : ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.28,990 ఉంటుంది.
మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.30వేలు బడ్జెట్లోని టాప్-10 మొబైల్స్ ఇవే!
ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్ కనిపెట్టేయొచ్చు! గూగుల్ కాంటాక్ట్స్ నయా ఫీచర్!