ETV Bharat / science-and-technology

విద్యార్థులకు ఉపయోగపడే టాప్​-12 ల్యాప్​టాప్స్ ఇవే!

Best Laptops For Students In India 2023 : కొవిడ్ సంక్షోభం తరువాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆన్​లైన్ క్లాసులు, డిజిటల్ తరగతులు పెరిగిపోయాయి. అందుకే విద్యార్థులకు సరికొత్త ల్యాప్​టాప్స్, కంప్యూటర్స్ అవసరం అవుతున్నాయి. మరి మీరు కూడా ఒక మంచి ల్యాప్​టాప్ కొందామని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న టాప్-12 ల్యాప్​టాప్ వివరాలు మీ కోసం..

TOP 12 Laptops For Students In telugu
Best Laptops For Students In India 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 4:41 PM IST

Best Laptops For Students In India 2023 : లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ప్రతిసారీ.. విద్యావిధానంలో సమూలమైన మార్పులు వస్తున్నాయి. విద్యార్థులు ఒకప్పుడు కేవలం పుస్తకాలను మాత్రమే చదివేవారు. హోంవర్కులు కూడా మాన్యువల్​గానే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారుతోంది. ఆన్​లైన్​లో క్లాసులు జరుగుతున్నాయి. హోంవర్కులు కూడా ల్యాప్​టాప్స్​లో చేయాల్సి వస్తుంది. అందుకే క్రమంగా కంప్యూటర్లు, ల్యాప్​టాప్​ల వినియోగం పెరుగుతోంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన మంచి ల్యాప్​టాప్స్​/ కంప్యూటర్స్​ అందించాల్సి వస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. మరి బెస్ట్ ల్యాప్​టాప్​ను ఎంచుకోవడం ఎలా?

వాస్తవానికి విద్యార్థుల అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్​, కాలేజ్ విద్యార్థుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే సైన్స్​, ఆర్ట్స్​, టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల అవసరాలు కూడా​ భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ల్యాప్​టాప్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

ల్యాప్​టాప్ కొనేముందు ఏమేం చూడాలి?
How Select Best Laptops : ల్యాప్​టాప్​లో విద్యార్థికి అవసరమైన అధునాతన ఫీచర్లు అన్నీ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు స్క్రీన్ సైజ్​ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటే, అది కంటిపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. అలాగే..

  • ల్యాప్​టాప్ బరువు తక్కువగా ఉండాలి.
  • బ్యాటరీ లైఫ్ బాగుండాలి.
  • స్టోరేజ్ కపాసిటీ ఎక్కువగా ఉండాలి.
  • ఎక్కువ కాలం మన్నిక రావాలి. అంటే కనీసం 3-4 సంవత్సరాలు వర్క్ చేయాలి.
  • మంచి ప్రాసెసర్​ ఉండాలి.
  • బ్రాండెడ్ ల్యాప్​టాప్స్ తీసుకోవాలి. ఉదాహరణకు యాపిల్​, హెచ్​పీ, డెల్​, Asus లాంటి బ్రాండెడ్​ ల్యాప్​టాప్స్ తీసుకోవాలి.
  • ధర కూడా అందుబాటులో ఉండాలి.

​Top 12 Laptops For Students : ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న.. విద్యార్థులకు ఉపయోగపడే టాప్​-12 ల్యాప్​టాప్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Dell 15 Laptop, Intel core i5 : కాలేజ్ విద్యార్థులకు ఈ డెల్​ ల్యాప్​టాప్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.53,490 వరకు ఉంది.

Dell 15 Laptop
డెల్​ 15 ల్యాప్​టాప్​

2. Lenovo IdeaPad 3 : దీనిలో హెచ్​డీ క్వాలిటీ కెమెరా ఉంది. కనుక ఆన్​లైన్ క్లాసుల కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని ధర సుమారుగా రూ.36,990 వరకు ఉంటుంది.

Lenovo IdeaPad 3
లెనోవో ఐడియాపాడ్​ 3

3. Acer Aspire Lite 11th Gen : ప్రీమియం లుక్​తో.. లైట్​ వెయిట్​, స్టన్నింగ్ హెచ్​డీ క్వాలిటీ డిస్​ప్లే కలిగిన ల్యాప్​టాప్ ఇది. ఆన్​లైన్​ క్లాస్​లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.30,990 వరకు ఉంటుంది.

Acer Aspire Lite 11th Gen
ఏసర్​ ఆస్పైర్​ ల్యాప్​టాప్​

4. Xiaomi Notebook Pro Max : విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్​తో, ఇంటెల్​ కోర్​ i5 ప్రాసెసర్ కలిగిన ఈ ల్యాప్​టాప్​ కాలేజ్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.50,999 వరకు ఉంటుంది.

Xiaomi Notebook Pro Max
షావోమీ నోట్​బుక్​ ప్రో మ్యాక్స్​

5. Lenovo V15 Intel Celeron : తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్​టాప్ ఇది. స్కూల్ విద్యార్థులకు ఇది సరిపోతుంది. దీని ధర రూ.23,399 వరకు ఉంటుంది.

Lenovo V15 Intel Celeron
లెనోవో వీ15 ల్యాప్​టాప్​

6. HP 14s, 12th Gen : ఆన్​లైన్ క్లాసులకు, మీడియం టాస్క్​లు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర సుమారుగా రూ.59,990 వరకు ఉంటుంది.

HP 14s
హెచ్​పీ ల్యాప్​టాప్​ 14ఎస్​

7. Dell Inspiron 7420 : స్కూల్, కాలేజ్ విద్యార్థులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆన్​లైన్​ క్లాసులకు, మీడియం-టు-హెవీ టాస్క్​లకు​ ఇది ఉపయోగపడుతుంది. దీని ధర సుమారుగా రూ.53,990 ఉంటుంది.

Dell Inspiron 7420
డెల్​ ఇన్​స్పిరాన్​ 7420

8. Apple 2020 MacBook Air : విద్యార్థులకు మాత్రమే కాదు.. ఎడిటర్స్, బిజినెస్ పీపుల్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ యాపిల్ ల్యాప్​టాప్ తీసుకుంటే, ఇంట్లోని వారందరూ దీనిని వాడుకోవచ్చు. దీని వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. పైగా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. కనుక ఆన్​లైన్ క్లాసులకు ఇది హెల్ప్​ఫుల్​గా ఉంటుంది. మార్కెట్​లో దీని ధర రూ.84,490 వరకు ఉంటుంది.

Apple 2020 MacBook Air
యాపిల్ మ్యాక్​బుక్​ ఎయిర్​

9. Hp Pavilion X360 : విద్యార్థులతోపాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్​కు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆన్​లైన్​ క్లాసులకే కాదు.. వీడియో ఎడిటింగ్​కు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్​లో దీని ధర రూ.53,990 వరకు ఉంది.

Hp Pavilion X360
హెప్​పీ పెవిలియన్​ ఎక్స్​360

10. Samsung Galaxy Book2 : ఈ శాంసంగ్ ల్యాప్​టాప్​లో తక్కువ వెలుతురులో కూడా చక్కగా టైప్ చేసుకోవడానికి వీలవుతుంది. లైట్ వెయిట్​తో, స్టైలిష్ లుక్​తో ఉండే ఈ ల్యాప్​టాప్​ విద్యార్థులకు చాలా హెల్ప్​ఫుల్​గా ఉంటుంది. మార్కెట్​లో దీని ధర రూ.62,990 వరకు ఉంటుంది.

Samsung Galaxy Book2
శాంసంగ్​ గెలాక్సీ బుక్​2

11. ASUS VivoBook 14 (2021) : పెద్ద స్క్రీన్​తో.. స్లిమ్​గా, లైట్​వెయిట్​తో ఈ ల్యాప్​టాప్​ ఉంటుంది. స్కూల్​, కాలేజ్ విద్యార్థులకు ఇది బాగుంటుంది. దీని ధర రూ.42,990 వరకు ఉంటుంది.

ASUS VivoBook 14
ASUS వివోబుక్​ 14

12. Acer Aspire 5 : కాలేజ్ విద్యార్థులు ఆన్​లైన్ క్లాసులు వినడానికి ఇది ఎంతో బాగుంటుంది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 10 గంటలు. పైగా దీనితో మీడియం టాస్క్​లు కూడా చేయవచ్చు. మార్కెట్​లో దీని ధర రూ.52,000 వరకు ఉంటుంది.

Acer Aspire 5
ఏసర్​ ఏస్పైర్ 5

నోట్​ : ఈ ఆర్టికల్​లో తెలిపిన ధరలు - మార్కెట్ ధరలతో పోల్చి చూస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

లక్షలాది మంది వాడుతున్న పాస్​వర్డ్​ ఇదే! మీది కూడా అదేనా? సైబర్ ఎటాక్ గ్యారెంటీ!

సీక్రెట్​గా ఇతరుల వాట్సాప్ స్టేటస్​ చూడాలా? ఈ సింపుల్ ట్రిక్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.