Atoms in human body: మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? సుమారు 700 కోట్ల కోట్ల కోట్ల కోట్లు (7 ఆక్టిలియన్లు)! వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు. సాధారణంగా చిన్నవారిలో తక్కువ అణువులుంటాయి. పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి. సగటున మన శరీంలో 87% వరకూ హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి. వీటికి కార్బన్, నైట్రోజన్ అణువులనూ కలిపితే మొత్తం 90% ఇవే ఆక్రమిస్తాయి.
7 Octillions atoms:
మనలో చాలామందిలో 41 రసాయన మూలకాలుంటాయి. తక్కువ మోతాదులో ఉండే (ట్రేస్) మూలకాల అణువుల కచ్చితమైన సంఖ్య వయసు, ఆహారం, పర్యావరణాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో జరిగే రసాయన చర్యలకు ఇవి అవసరం. కానీ కొన్ని మూలకాలు.. సీసం, యురేనియం, రేడియం వంటివి ఎలాంటి పనుల్లోనూ పాల్గొనవు. పైగా విషతుల్యాలు కూడా. ఇవి శరీరంలో సహజంగానే స్వల్ప స్థాయిలో ఉంటాయి. కానీ ఎలాంటి హాని చేయవు.
ఇదీ చదవండి: మరణాన్ని జయించాలనే మానవుని ఆశ తీరుతుందా!