ETV Bharat / science-and-technology

కొత్త యాపిల్​ ఐప్యాడ్​.. వచ్చేది ఈ నెలలోనే!

యాపిల్​ ఐప్యాడ్​ ప్రో 2021 ఈ నెలలో విడుదల కానుందని తెలుస్తోంది. దీనికి మినీ-ఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుందని సమాచారం.

Apple iPad Pro 2021 with Mini-LED display is likely to launch in april
కొత్త యాపిల్​ ఐప్యాడ్​.. వచ్చేది ఈ నెలలోనే!
author img

By

Published : Apr 12, 2021, 7:15 PM IST

Updated : Apr 12, 2021, 7:20 PM IST

యాపిల్​.. ఈ పేరుకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఐఫోన్​ నుంచి ఐప్యాడ్​ వరకు ఎన్నో ప్రాడక్ట్స్​తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది యాపిల్​. తాజాగా.. మరో ప్రాడక్ట్​ను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సంస్థ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అదే యాపిల్​ ఐప్యాడ్​ ప్రో 2021. ఇది ఈ నెలలోనే విడుదలవుతుందని పలు నివేదికలు చెబుతుండటం యాపిల్​ ప్రేమికులకు మరింత సంతోషాన్నిచ్చే విషయం.

యాపిల్​ ఐప్యాడ్​ ప్రో 2021...

ఈ యాపిల్​ ఐప్యాడ్​ ప్రో 2021కు ఓ ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. దీనికి మినీ-ఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుందని సమాచారం. ఈ నెల రెండో భాగంలో దీనికి సంబంధించి ప్రకటన వస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇందులో యాపిల్​ ఎమ్​1 చిప్​ ప్రాసెసర్​ ఆధారంగా నడిచే యాపిల్​ ఏ14ఎక్స్ ఉంటుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. అప్​గ్రేడెడ్​ కెమెరా కూడా ఉంటుందని అంటున్నాయి.

మినీ-ఎల్​ఈడీ సప్లైలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఈ ఐప్యాడ్​ను లాంచ్​ చేసేందుకే యాపిల్​ మొగ్గు చూపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి.

మరి ఐప్యాడ్​కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.

ఇదీ చూడండి:- టాప్​ స్మార్ట్​ఫోన్లలో మొదటి నాలుగు ఐఫోన్​లే​

Last Updated : Apr 12, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.