ETV Bharat / science-and-technology

'పవర్​ సాకెట్​లో కాయిన్​ పెట్టు'.. చిన్నారికి అలెక్సా ఛాలెంజ్.. చివరకు... - అమెజాన్ అలెక్సా ఛాలెంజ్​

Amazon alexa: అమెజాన్ అలెక్సా ఓ పదేళ్ల చిన్నారికి ఇచ్చిన డేంజరస్ ఛాలెంజ్ చర్చనీయాంశమైంది. దీనిపై చిన్నారి తల్లి ట్విట్టర్​ వేదికగా స్పందించి భయాందోళన వ్యక్తం చేసింది. ఛాలెంజ్​ సమయంలో తాను కూతురి పక్కన లేకపోతే ఏం జరిగి ఉండేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ ఛాలెంజ్​ ఏంటంటే..

amazon alexa, అమెజాన్ అలెక్సా డేంజర్ ఛాలెంజ్
10 ఏళ్ల చిన్నారికి అమెజాన్ అలెక్సా డేంజర్ ఛాలెంజ్​- తల్లి షాక్​
author img

By

Published : Dec 29, 2021, 7:16 PM IST

Amazon alexa: అమెజాన్​ అలెక్సా మనం ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెబుతుంది. గగుర్పాటుకు గురి చేసే విషయాలు చెప్పగల సామర్థ్యం కూడా దాని సొంతం. అయితే ఓ పదేళ్ల బాలిక విసిరిన ఛాలెంజ్​కు అమెజాన్​ అలెక్సా ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం కావడమే ఇందుకు కారణం. క్రిస్టిన్​ లివ్​దాల్​ అనే మహిళ ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించి భయాందోళన వ్యక్తం చేసింది.

ఏం జరిగిందంటే..

క్రిస్టిన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె 10 ఏళ్ల కూతురు అలెక్సాను ఛాలెంజ్ అడిగింది. అందుకు అది ' ఫోన్ ఛార్జర్​ సగ భాగాన్ని సాకెట్​లో పెట్టి బయట మిగిలిన ప్లగ్​ మొనలను నాణెంతో టచ్​ చెయ్​' అని బదులిచ్చింది. ఈ సమాధానం విన్న క్రిస్టిన్ షాక్​కు గురైంది. అలా చేస్తే మంటలు చెలరేగుతాయని, షాక్​ కొట్టే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తాను కూతురి పక్కనే ఉన్నాను కాబట్టి సరిపోయిందని, లేకపోతే ఏం జరిగి ఉండేదో అని వాపోయింది.

క్రిస్టిన్ ట్వీట్​తో అమెజాన్ అలెక్సా​ పనితీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 2020లో టిక్​టాక్ ఔట్​లెట్ ఛాలెంజ్​లాగే ఇది కూడా డేంజర్​గా ఉందని ​మాషబుల్​ వార్తా సంస్థ తెలిపింది. అసలు అలెక్సాలో ఇలాంటి విషయం ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేసింది.

క్రిస్టిన్ ట్వీట్​పై అమెజాన్​ కూడా స్పందించింది. అలెక్సా తన సమాచారాన్ని కంపెనీ క్లౌడ్ నుంచి పొందుతుందని పేర్కొంది. అయితే వివరాలు అస్పష్టంగా ఉన్నాయని చెప్పింది. ఈ విషయంపై స్పష్టత కోరిన మాషబుల్ సంస్థకూ అమెజాన్ బదులిచ్చింది. కరెంట్ సాకెట్​ ఛాలెంజ్​కు సంబంధించిన రెస్పాన్స్​ను అలెక్సా నుంచి తొలగించినట్లు తెలిపింది. కస్టమర్ల విశ్వాసమే తమకు అత్యంత ముఖ్యమని, వారికి కచ్చితమైన, సంబంధిత, ఉపయోగకర సమాచారాన్ని అందించడానికే అలెక్సాను రూపొందించామని స్పష్టం చేసింది. లోపాన్ని గుర్తించిన వెంటనే దానిని పరిష్కరించడానికి వేగంగా చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: శాస్త్రరంగంలో ఈ ఏడాది 'అద్భుత విజయాలు' ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.