సామాజిక మాధ్యమాల్లో యూజర్ల డేటా భద్రతపై రోజు రోజుకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. లింక్డ్ఇన్లో తాజాగా 50 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
ఇటీవలే ఫేస్బుక్లో కూడా 53 కోట్లకుపైగా యూజర్ల (భారత్‌లో 61 లక్షల యూజర్ల డేటాతో కలిపి) డేటా ఇంటర్నెట్లో కనిపించడం కలకలం రేపింది.
లింక్డ్ఇన్ నుంచి లీకైన డేటాలో ఏముంది?
యూజర్ల పూర్తిపేర్లు, ఈ మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, పని చేసే స్థలం, ఇతర సామాజిక మాధ్యమాలకు సంబంధించిన లింక్‌లు సహా మరిన్ని వివరాలు లీకైన డేటాలో ఉన్నట్లు నివేదికలో తేలింది.
హ్యాకర్ ఫోరమ్‌లో ఉన్న ఈ లీకైన డేటాను 2 డాలర్లు చెల్లించి శాంపిల్స్ చూసేందుకు.. సైబర్ దాడి చేసిన గ్రూప్ అనుమతిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.. 50 కోట్ల మంది యూజర్ల డేటా విక్రయానికి మాత్రం వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నట్లు వివరించింది.
లింక్డ్ఇన్ ఏమందంటే..
డేటా లీకేజీపై లింక్డ్ఇన్ స్పందించింది. లీకైన డేటాను వివిధ కంపెనీలు, వెబ్సైట్ల నుంచి హ్యాకర్లు సేకరించినట్లు గుర్తించామని తెలిపింది. అయితే లీకైన డేటా అంతా సాధారణ యూజర్లు బహిరంగంగా చూడగలిగేది మాత్రమేనని వెల్లడించింది. ప్రైవేటు వ్యక్తుల డేటా ఏదీ లీక్ అవలేదని తమ అంతర్గత సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: