ETV Bharat / priya

వెరైటీ కోసం సుత్లీ చికెన్​ ట్రై చేయండిలా!​ - స్పెషల్ చికెన్​ వంటకం

ఆదివారం వచ్చిందంటే లేక.. ఏదైనా స్పెషల్ సందర్భమైనా ఇంట్లో చికెన్ వండుకుంటాం. అయితే ఎప్పుడూ చేసినా.. పులుసు లేక ఫ్రై వండేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఈ సారి అలాగే అలా కాకుండా వెరైటీ వంటకాన్ని ట్రై చేద్దామా?

Sutili Chicken
సుత్లీ చికెన్​
author img

By

Published : Aug 24, 2021, 4:57 PM IST

ఏదైనా స్పెషల్​ వేడుక అయినా.. ఆదివారం వచ్చినా.. ఆ రోజు చికెన్​తో​ వెరైటీలు చేయాలని భావిస్తాం. పులుసు పెట్టాలా? వేపుడు చేయాలా? అని ఆలోచిస్తాం. గబగబా బిర్యానీ వండేస్తాం. కానీ చికెన్‌తో అవే కాదు మరికొన్ని రుచులను కూడా చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీలు ట్రై చేయవచ్చు. అటువంటిదే ఈ సుత్లీ చికెన్​.

కావాల్సినవి: మాంసం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్​, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, బాదం ఆకులు, సుత్లీ, విస్తరి ఆకులు.

తయారీ విధానం: ముందుగా చికెన్​ ముక్కులు సన్నగా కోసి.. బాగా కడిగి ఓ బేసిన్​లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్​, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాలు పొడి, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర.. వేసి బాగా కలపాలి.

మరోవైపు ఆవిరి పాత్ర తీసుకుని కింద పాత్రలో నీళ్లు వేసి.. పైన పాత్రలో విస్తరి ఆకు ఉంచి వేడి వేయాలి. ఆ తర్వాత ఆవిరి పాత్రలో బాదం ఆకులను ఉంచి కాసేపు వేడి చేయాలి. ఆవిరికి ఆకులు మెత్తగా అవుతాయి. అనంతరం వాటిని తీసి.. కలిపిన చికెన్​ ముక్కలను అందులో వేసి సుత్లీతో పొట్లాలు కట్టాలి. ఆ పొట్లాలను ఆవిరి పాత్రలో ఉంచి 25 నిమిషాలు ఉడికించాలి. అంతే నోరూరే సుత్లీ చికెన్​ రెడీ. ఆ పొట్లం విప్పి.. ఉడికిన చికెన్​పై కాస్త వెన్న వేసి తింటే.. ఆ రుచికి మయిమరిచిపోవాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చల్ల మిరపకాయలతో చికెన్​ ఫ్రై.. ట్రై చేసేయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.