ETV Bharat / priya

కూల్​ కూల్​ వేళ హాట్​ 'టర్కిష్​ సూప్' చేయండిలా... - turkey soup

వాతావరణం చల్లగా మారితే చాలు.. వేడి వేడి ఆహారంపై మనసు లాగుతుంది. కడుపారా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది.కానీ, ఆకలేసింది కదా అని ఏది పడితే అది తింటే బరువు పెరిగిపోతామని భయం. అలాంటి వారు ఎంచక్కా ఈ టర్కిష్​ సూప్​ ఓ సారి ట్రై చేయండి..

turkish soup recipe in telugu etv bharath
కూల్​ కూల్​ వేళ.. హాట్​గా 'టర్కిష్​ సూప్' రెసిపీ​!​
author img

By

Published : Jun 24, 2020, 1:01 PM IST

చల్లని వేళ... వేడివేడిగా సూప్ తాగితే కడుపుతో పాటు మనసూ నిండిపోతుంది. అందుకే శాకాహారులు ఎంతో ఇష్టపడే టర్కిష్​ సూప్​ను మీ ఇంట్లోనే ఇలా చేసుకోండి...

కావాల్సినవి

  • ఎర్ర పప్పు - కప్పు
  • వెజిటబుల్ స్టాక్ - నాలుగు కప్పులు
  • ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
  • బంగాళాదుంప ముక్కలు - అర కప్పు
  • కారం - టీస్పూన్
  • ఉప్పు - టీస్పూన్

తయారీ

ముందుగా ఎర్ర పప్పును కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో పప్పుతో పాటు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కారం వేసి ఆఖరున వెజిటబుల్ స్టాక్ కూడా పోసేయాలి. ఆ తర్వాత దీన్ని మరిగించుకోవాలి. మరుగుతుండగా మంట తగ్గించుకొని సగం వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు ఉడికించుకొని ఆ తర్వాత ఉప్పు వేయాలి. ఇందులోంచి పైపైన ఉన్న నీటిని తీసి పక్కన పెట్టుకొని, అడుగున ఉన్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటినీ తిరిగి కలుపుకొని మరికాసేపు మరగబెట్టుకుంటే సరి.. టర్కిష్ సూప్ సిద్ధమవుతుంది.

ఇదీ చదవండి:బేక్​ చేయకుండా కేక్​ చేసుకోండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.