కోడిగుడ్డులోని ప్రొటీన్లు ఆరోగ్యాన్ని పెంచితే.. మైమరిపించే వాటి రుచి మళ్లీ మళ్లీ తినేలా చేస్తాయి. కానీ, ప్రతిసారీ ఒకేలా వండుకుంటే తినేవారికి బోరు కదా! మరి ఈ సారి, కొల్హాపురి సైల్ గుడ్డు కూర ఎలా వండాలో నేర్చుకుని, చేసేద్దాం రండి..
కావాల్సినవి
గుడ్లు: ఐదు,
అల్లంవెల్లుల్లి: ఒకటిన్నర టేబుల్‌స్పూను,
ఉల్లిపాయలు: రెండు,
లవంగాలు: ఎనిమిది,
మిరియాలు: 12,
టొమాటో: ఒకటి,
ఎండుమిర్చి: నాలుగు,
పసుపు: అరటీ స్పూను,
గసగసాలు: టీస్పూను,
కొబ్బరి తురుము: 2 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు: తగినంత,
నూనె: 4 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం
- గుడ్లు ఉడికించి పెంకు తీసి ఉంచాలి.
- బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మిరియాలు, లవంగాలు వేయాలి. తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిముక్కలు వేయాలి. ఇప్పుడు పసుపు, గసగసాలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక ఇది మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
- బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి ఉడికించిన గుడ్లను వేసి వేయించి తీయాలి. అందులోనే రుబ్బిన మసాలా మిశ్రమం వేసి సుమారు కప్పు నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు వేయించిన గుడ్లను కూడా వేసి సిమ్‌లో కాసేపు ఉడికించి దించాలి.
ఇదీ చదవండి: నోరూరించే 'ఎగ్ సలాడ్'తో ఆరోగ్యం దరిచేరుతుంది!