'చాక్లెట్ ఆల్మండ్ పుడ్డింగ్' రుచికే కాదు.. ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బాదంలోని పోషకం, చాక్లెట్ లోని మాధుర్యం కలిపి సింపుల్ గా పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి...
కావల్సినవి
- ఉప్పులేని వెన్న, క్యాస్టర్ షుగర్ - నూటయాభై గ్రా(150 గ్రాములు) చొప్పున,
- కోడిగుడ్లు - మూడు, బాదంపొడి - వంద గ్రా(100 గ్రాములు),
- మైదా - డెబ్భై గ్రా(70 గ్రాములు),
- చాక్లెట్ పొడి - నలభై గ్రా(40 గ్రాములు),
- బేకింగ్ పొడి - పదిహేను గ్రా(17 గ్రాములు),
- పాలు - అరవై ఎంఎల్(60 గ్రాములు),
- డార్క్ చాక్లెట్ పలుకులు - డెబ్భై గ్రా(70 గ్రాములు),
- బటర్ కాగితం- ఒకటి.
తయారీ
- ఓవెన్‌ను నూట అరవైఅయిదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసి పెట్టుకోవాలి. ఒక కేక్ టిన్నును తీసుకుని బటర్‌పేపర్‌ను రాయాలి. ఇప్పుడు మైదా, చాక్లెట్ పొడిని జల్లించి పెట్టుకోవాలి.
- క్యాస్టర్ షుగర్, వెన్నను ఓ పాత్రలోకి తీసుకుని చెక్కచెంచాతో బాగా గిలక్కొట్టినట్లు చేయాలి. ఇందులో కోడిగుడ్ల సొనను ఒకేసారి వేసేయాలి. మైదా, చాక్లెట్ పలుకులు, బేకింగ్‌పొడి, చాక్లెట్‌పొడి, బాదంపొడి వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. చివరగా పాలు చేర్చాలి.
- ఈ మిశ్రమాన్ని కేక్ టిన్‌లోకి తీసుకొని నీళ్లు పోసిన బేకింగ్ ట్రేలో ఉంచి నలభై నుంచి యాభై నిమిషాల దాకా బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వెనిల్లా ఐస్‌క్రీంతో కలిపి తింటే బాగుంటుంది.
ఇదీ చదవండి: 'పెసర చెగోడీలు' కరకరలాడిద్దామిలా...!