ETV Bharat / priya

'చికెన్‌ ఘీ రోస్ట్‌'.. తింటే వదల్లేని టేస్ట్! - easy snacks

మాంసాహార ప్రియులకు పసందైన ఆహారం చికెన్. కొందరికైతే చికెన్ లేనిదే ముద్ద దిగదు. ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా లభించే చికెన్ ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే, మీ కోసం టేస్టీ చికెన్ రెసిపీ తెచ్చేశాం. మరింకెందుకు ఆలస్యం మన సంప్రదాయాన్ని జోడించి కాస్త నెయ్యి దట్టించి నోరూరించే చికెన్‌ ఘీ రోస్ట్‌ చేసేద్దాం రండి...

try chicken ghee roast at home with this recipe
'చికెన్‌ ఘీ రోస్ట్‌'.. తింటే వదల్లేని టేస్ట్!
author img

By

Published : Aug 15, 2020, 1:01 PM IST

చికెన్‌ ఘీ రోస్ట్‌ రెస్టారెంట్ రుచితో మనింట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు.. ఎలాగో మీరే చూసేయండి..

కావల్సినవి

చికెన్‌ - ముప్పావు కేజీ, గిలక్కొట్టిన పెరుగు - ముప్పావు కప్పు, కారం - చెంచా, పసుపు - అరచెంచా, నిమ్మరసం - పెద్ద చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత.

మసాలాకోసం

ఎండుమిర్చి - ఆరు, మిరియాలు - అరచెంచా, మెంతులు - పావుచెంచా లవంగాలు - నాలుగు, జీలకర్ర, సోంపు - పావుచెంచా చొప్పున, ధనియాల పొడి - మూడు చెంచాలు, వెల్లుల్లి తరుగు - నాలుగు చెంచాలు, చింతపండు - ఉసిరికాయంత (వేడినీటిలో నానబెట్టుకోవాలి), బెల్లం తరుగు - రెండు చెంచాలు, నెయ్యి - అరకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ

చికెన్‌ ముక్కల్ని శుభ్రం చేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగూ, కారం, పసుపూ, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఇంతలో బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నెయ్యి వేయాలి. అది కరిగాక చింతపండూ, బెల్లం తరుగూ, ఉప్పూ తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. బాణలిని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. పెద్ద చెంచా నెయ్యి వేయాలి. అది కరిగాక చికెన్‌ ముక్కలు వేసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక ఇవతలకు తీసేయాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. దాని పచ్చివాసన పోయాక.. బెల్లం తరుగూ, కొద్దిగా చింతపండురసం, కొంచెం ఉప్పూ, చికెన్‌ ముక్కలూ వేసి.. బాగా కలపాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేస్తే సరి.

ఇదీ చదవండి: కేరళ చేపల వెరైటీలు.. మనింట్లోనే చేసుకుందామిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.