ETV Bharat / priya

తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్​ చాక్లెట్

రోజంతా ఉల్లాసంగా పని చేయడానికి ఎంతో శక్తి అవసరం. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఆఫీసులో పని ఒత్తిడి ఎదుర్కొని ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఫీలవుతారు. బాగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది తక్షణ శక్తి పొందాలంటే.. 'సినమన్​ హాట్​ చాక్లెట్​' తాగాల్సిందే. దీని తయారీ చాలా సులభం. ఎలాగో ఓసారి చూద్దామా..

make cinnamon hot chocolate at home
తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్​ చాక్లెట్
author img

By

Published : Jun 9, 2020, 1:03 PM IST

Updated : Jun 9, 2020, 2:34 PM IST

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరు విశ్రాంతి లేకుండా ఏదో పని చేస్తుంటారు. ఫలితంగా ఒత్తిడికి గురై అలసిపోతారు. అలాంటివారు ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం పొందాలంటే 'సినమన్​ హాట్​ చాక్లెట్' తాగాల్సిందే. దీనిని ఇంట్లో లభించే పదార్థాలతో చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఓసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..​

పాలు- 900 మిల్లీ లీటర్లు, దాల్చిన చెక్క- 4, చాక్లెట్​- 500 గ్రాములు, క్రీమ్​- 2 టేబుల్ స్పూన్​లు, కాఫీ పౌడర్​-1 టీ స్పూన్​.

తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్​ చాక్లెట్

ఇలా చేస్తే.. టేస్ట్​ అదిరిపోతుంది!

'సినమన్​ హాట్​ చాక్లెట్​' తయారు చేయడానికి పైన చెప్పిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ​పాలు వేడి చేసి ఓ పాత్రలో వేసుకోవాలి. అందులో బ్రౌన్​ షుగర్​, దాల్చిన చెక్క, చాక్లెట్ వేయాలి. ఆ తర్వాత చాక్లెట్ కరిగే వరకు తిప్పుతూ బాగా మరిగించాలి. తర్వాత ఓ గ్లాసులో ఆ ద్రావణాన్ని వేసి పైన క్రీమ్​ పూయాలి. దానిపై కొంచెం కాఫీ పౌడర్​ వేసుకోవాలి. అంతే సినమన్​ హాట్​ చాక్లెట్​ రెడీ. చూశారుగా ఎంత సులభమో. మీరూ తయారు చేసి, మీ అభిప్రాయాలను ఈటీవీ భారత్​తో పంచుకోండి. ​

ఇదీ చూడండి: దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి

Last Updated : Jun 9, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.