ETV Bharat / priya

శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!

శ్రావణమాసం అంటేనే నోములూ, వ్రతాల నెల. ఈ సమయంలో చేసుకునే పూజలతోపాటూ అమ్మవారికి నివేదించే పదార్థాలకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. ఎప్పుడూ చేసుకునే పాయసం, పులిహోర, పరమాన్నంతోపాటూ ఈసారి కాస్త వెరైటీగా వీటిని వండి నివేదించండి.

sravanam
శ్రావణ మాసం
author img

By

Published : Aug 9, 2021, 9:42 AM IST

శ్రావణమాసం అంటేనే నోములూ, వ్రతాల నెల. ఈ సమయంలో చేసుకునే పూజలతోపాటూ అమ్మవారికి నివేదించే పదార్థాలకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. ఎప్పుడూ చేసుకునే పాయసం, పులిహోర, పరమాన్నంతోపాటూ ఈసారి కాస్త వెరైటీగా వీటిని వండి నివేదించండి.

బేసన్‌ హల్వా

కావలసినవి

సెనగపిండి: కప్పు, నెయ్యి: కప్పు, చక్కెర: ముప్పావుకప్పు, పాలు: రెండు కప్పులు, యాలకులపొడి: చెంచా, బాదం, పిస్తా పలుకులు: పావుకప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో పాలు, చక్కెర వేసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాలు మరుగుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు బాణలిని స్టౌమీద పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. అది వేడెక్కాక సెనగపిండి వేసి అడుగు అంటకుండా వేయించాలి. సెనగపిండి వేగి కమ్మని వాసన వస్తున్నప్పుడు స్టౌని సిమ్‌లో పెట్టి కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ముద్దలా అవుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఇది హల్వాలా తయారయ్యాక యాలకులపొడి, బాదం, పిస్తా పలుకులు వేసి మరోసారి కలిపి దింపేయాలి.

Sravana Masam  recipes
బేసన్​ హల్వా

రవ్వ మలై లడ్డు

కావలసినవి

నెయ్యి: కప్పు, బొంబాయిరవ్వ: ఒకటిన్నర కప్పు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: పావుకప్పు, యాలకులపొడి: చెంచా, కొబ్బరితురుము: అరకప్పు, చిక్కని క్రీమ్‌: కప్పు, చక్కెరపొడి: కప్పు, పాలు: నాలుగు టేబుల్‌స్పూన్లు, గసగసాలు: కొద్దిగా

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి సగం నెయ్యి వేయాలి. అది వేడెక్కాక స్టౌని సిమ్‌లో పెట్టి బొంబాయిరవ్వ వేసి వేయించాలి. అది ఎర్రగా వేగిందనుకున్నాక మరికొంచెం నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని కూడా వేయించుకోవాలి. తరవాత ఇందులో కొబ్బరితురుము, పాలు పోయాలి. అయిదు నిమిషాల తరవాత క్రీమ్‌, చక్కెరపొడి, యాలకులపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు దింపేసి మిగిలిన నెయ్యి, గసగసాలు వేసి లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది.

Sravana Masam  recipes
రవ్వ మలై లడ్డు

మసాలా దాల్‌ వడ

కావలసినవి

బియ్యం: అరకప్పు, కందిపప్పు: పావుకప్పు, సెనగపప్పు: పావుకప్పు, మినప్పప్పు: పావుకప్పు, పెసరపప్పు: పావుకప్పు, ఎండుమిర్చి: ఆరు, అల్లం: చిన్నముక్క, పుల్లని పెరుగు: టేబుల్‌స్పూను, కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: రెండు, నెయ్యి: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత.

తయారీవిధానం: ఓ గిన్నెలో పెసరపప్పు-ఎండుమిర్చి, మరో గిన్నెలో మిగిలిన పప్పులు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. రెండు గంటల తరువాత అన్ని పప్పులు, బియ్యం మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరవాత పెసరపప్పు, ఎండుమిర్చి, అల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెయ్యి, తగినంత ఉప్పు, కరివేపాకు తరుగు, పెరుగు, కొబ్బరితురుము వేసి బాగా కలుపుకోవాలి. స్టౌమీద కడాయిపెట్టి నూనె వేయాలి. అదివేడయ్యాక ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

Sravana Masam  recipes
మసాలా దాల్​ వడ

కొబ్బరి మిరియాల అన్నం

కావలసినవి

పొడిపొడిగా వండిన అన్నం: రెండు కప్పులు, నిమ్మరసం: నాలుగు చెంచాలు, కొబ్బరి తురుము: ముప్పావుకప్పు,మిరియాలపొడి: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, తాలింపు దినుసులు: రెండు చెంచాలు, పల్లీలు: కొన్ని, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఎండుమిర్చి: ఒకటి, జీడిపప్పు: కొన్ని.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి తాలింపుదినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేయించి... అన్నంపైన వేయాలి. అదే బాణలిలో మిగిలిన నూనెవేసి కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేయించి స్టౌ కట్టేసి మిరియాలపొడి, కొబ్బరి తురుము వేసి ఓసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా అన్నంపైన వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, నిమ్మరసం అన్నంపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.

Sravana Masam  recipes
కొబ్బరి మిరాయల అన్నం

ఇదీ చూడండి: ఆహా.. మొక్కజొన్నతో ఎన్ని రుచులో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.