వెజ్‌లో కూడా నాన్‌వెజ్ తిన్న అనుభూతిని ఇచ్చేవి అంటే పుట్టగొడుగులే. వీటితో ఎలాంటి రెసిపీలు చేయాలో తెలియక చాలామంది కొనడం కూడా మానేస్తుంటారు. కానీ ఓసారి వీటికి అలవాటుపడితే వదులుకోవడం చాలా కష్టం! అంత రుచిగా ఉంటాయి మరి. అయితే పుట్టగొడుగులతో (Mushroom Fry) చేసుకొనే వేపుడు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ స్టోరీ చదివి వంటింట్లో గరిటె తిప్పేయండి.
కావాల్సిన పదార్థాలు
- పుట్టగొడుగులు
- ధనియాలు
- జీలకర్ర
- మిరియాలు
- దాల్చిన చెక్క
- లవంగాలు
- నూనె
- ఉల్లిపాయ ముక్కలు
- పచ్చిమిర్చి
- ఉప్పు
- టమాటాలు
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పౌడర్‌గా చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో నూనెలో వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సరిపడాఉప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, ముందుగా కట్ చేసుకొన్న పుట్టగొడుకు ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తరువాత కారం, సరిపడా ఉప్పు, ముందుగా మిక్సీ పుట్టుకొన్న మసాలా పొడి, కరివేపాకు, నిమ్మరసం వేసి కలుపుకొని చివరగా కొత్తిమేర వేసి కలుపుకుంటే పుట్టగొడుగు వేపుడు రెడీ అవుతుంది.
ఇదీ చూడండి: చవితి నైవేద్యాలు: 'గుడ్ కా మాల్ పువా' ఇలా చేసుకోండి!