ETV Bharat / priya

రుచికరమైన రవ్వ వడలు.. తింటే వదలరు! - రవ్వ వడ వంటకం

వడ.. అబ్బో దాని టేస్టే వేరు. అందులోనూ రవ్వతో (ravva vada) చేసిన వడలైతే మరీనూ!. నాలుకకు మరింత రుచినిస్తాయి. వడలను మినప పప్పుతో చేసే సమయం లేనప్పుడు సులభంగా తయారుచేసుకునే రవ్వ వడల గురించి తెలుసుకుందాం!.

ravva vada in telugu
రవ్వ వడ వంటకం
author img

By

Published : Oct 5, 2021, 7:04 AM IST

వడలను సాధారణంగా మినప పప్పుతో చేస్తారు. కానీ ఇది కాస్త సమయంతో (ravva vada recipe) కూడిన పని. తొందరగా, సులభంగా వడలను తయారుచేసుకోవడానికి మినప పప్పుకు బదులు రవ్వను వాడుకోవచ్చు. టేస్టు, టైమ్ రెండు కలిసొచ్చే విధంగా ఈ రవ్వ వడల (ravva vada) తయారీ ఉంటుంది.

ravva vada
రవ్వ వడ

కావాల్సిన పదార్థాలు: రవ్వ, ఉల్లిపాయలు, ఉప్పు, ఇంగువా, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, కొబ్బరి, క్యారెట్​, సన్నగా తరిమిన ఇతర కూరగాయలు, కొంచెం సోడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో కొద్దిగా రవ్వను నానబెట్టాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసి కలియబెట్టాలి. అనంతరం రవ్వ, ఉల్లిపాయలు, ఉప్పు, ఇంగువా, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, కొబ్బరి వేసి చేతితో బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమంలో సన్నగా తరిమిన క్యారెట్​, ఇతర కూరగాయాలు కూడా వేసుకోవచ్చు. మిశ్రమం ఇంకా చిక్కగా కాకపోతే బియ్యం పిండిని కొంచెం కలుపుకోవచ్చు. చిక్కగా మారిన మిశ్రమాన్ని నూనెలో ఉండలుగా వేసి వేయించుకోవాలి. అంతే.. వేడివేడి రవ్వ వడలు రెడీ.

ఇదీ చదవండి:చికెన్ వడా కర్రీ.. ఇడ్లీలతో తింటే ఆహా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.