మాంసం ప్రియులకు అతి ఇష్టమైంది మటన్. ఈ మటన్‌ను ఎప్పుడూ ఒకేలా చేసుకోకుండా కొత్తగా రుచి (ooragaya matton recipe) చూడాలని ఉందా? అయితే.. ఇంట్లో ఉండే ఊరగాయతో ట్రై చేయాల్సిందే!. ఊరగాయ, మటన్‌ను కలిపి ఘాటుగా (ooragaya matton curry) రుచి చూడాల్సిందే మరి!. ఊరగాయ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు:
- మటన్-250 గ్రాములు
- ఆవకాయ మసాలా ముద్ద- ఒక కప్పు
- జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు, ఇంగువ- సగం చెంచా
- ఎండు మిరపకాయలు-రెండు
- వెల్లుల్లి రెబ్బలు
- ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లులి
- పసుపు, కారం, గరం మసాలా
- ధనియాల పొడి, జీర పొడి, ఉప్పు, కొత్తిమీర.
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఆవ నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆవకాయ వేసి తగినన్ని నీళ్లు పోసి కాసేపు ఉడకనీయాలి. అనంతరం మటన్ వేసి బాగా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తగినంత కొత్తిమీర వేసుకుని పొయ్యి ఆఫ్ చేసుకుంటే రుచికరమైన ఊరగాయ మాంసం తయారీ పూర్తవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:నాన్‌వెజ్ స్పెషల్.. మిక్స్డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?