నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు (nuvvula annam recipe) చేస్తాయని అంటుంటారు. వాటిల్లోని ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరం సమతులంగా ఉండటానికి తోడ్పడుతుంది. నువ్వుల్ని కూరల్లో రుచిని పెంచేందుకు (nuvvula annam preparation) ప్రత్యేకంగానే వేసుకుంటాం. కానీ నువ్వులతో అన్నం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా!
కావల్సిన పదార్థాలు:
నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువా, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు.
తయారీ విధానం:
ముందుగా పొయ్యి మీద ఓ గిన్నెలో (nuvvula podi annam) నూనె వేడిచేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువా, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి పచ్చిమిర్చి, ఎండు మిర్చి, పసుపు కలపాలి. అప్పటికే తయారు చేసి పెట్టుకున్న అన్నం, నువ్వుల పొడిని ఈ మిశ్రమానికి కలపాలి. అన్నం బాగా కలిసేలా మిశ్రమాన్ని కలిపి పొయ్యిపై నుంచి దించాలి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే నువ్వుల అన్నం రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:healthy diet: దీంతో మన బరువు కంట్రోల్!