ETV Bharat / priya

పాలు కాని పాలు.. పోషక విలువల్లో రారాజు!

పాలు అనగానే మనకు ఆవు, గేదె పాలే గుర్తుకువస్తాయి. ఈ మిల్క్​లాగే పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఇతర పాలు కూడా ఉన్నాయి. అవేంటి.. వాటి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం..?

author img

By

Published : Oct 2, 2021, 5:32 PM IST

non diary milks
కొబ్బరి పాల ఉపయోగాలు

ఆవు, గేదె పాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. డైరీ మిల్క్ మాత్రమే కాకుండా నాన్ డైరీ మిల్క్​ అంటే కొబ్బరి పాలు, బాదం పాలు, సోయా పాలు, ఓట్ మిల్క్​లోనూ ప్రోటీన్లు అధికమే. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివేనా? కాదా అనే విషయం చూద్దాం.

కొబ్బరి పాలు: పచ్చి కొబ్బరి ఎంతో ఆరోగ్యకరం. వంటలకు కొబ్బరిని అదనంగా చేర్చితే వచ్చే రుచే వేరు. పచ్చి కొబ్బరి నుండి తీసే కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి. ఆరోగ్యానికి శ్రేష్ఠమైన ఈ పాలల్లో కేలరీలు ఎక్కువ. ఫైబర్ అధికంగా ఉండటం వలన కొబ్బరి పాలకు బరువును తగ్గించే గుణముంది. ఇందులో ఉండే మాంగనీస్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకూ మంచిదే. కొబ్బరి పాలల్లో రోగనిరోధకశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

coconut milk
కొబ్బరి పాలు

బాదం పాలు: మార్కెట్లో దొరికే శాకాహారం బాదం పాలు. చల్లగా ఉండే పానీయాలు కోరుకునే వారికి ఒక గొప్ప వరం బాదం పాలే. ఒక కప్పు బాదం గింజల్లో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. మినరల్స్, ఐరన్, మాంగనీస్​తో పాటు 'బి' విటమిన్ అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. కంటికి మేలు చేసే 'ఏ' విటమిన్ కూడా ఈ పాలల్లో ఎక్కువే! దీనిలో ఉండే విటమిన్-ఇ వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

badham milk
బాదం పాలు

సోయా పాలు: సోయా మొక్కల నుంచి సేకరించిన అత్యుత్తమ పాల ఉత్పత్తులు సోయా పాలు. సోయా పాలు తక్షణ శక్తినిస్తుంది. దీనిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీనిలో లాక్టోజ్ తక్కువగా ఉంటున్నందున సులభంగా జీర్ణమవుతాయి. సోయా పాలకు బరువు తగ్గించే గుణం ఉంది. ఎముకలను పటిష్ఠంగా ఉంచుతాయి. రక్తపోటును క్రమబద్ధీకరించి అదుపులో ఉంచుతాయి.

soya milk
సోయా పాలు

ఓట్స్ మిల్క్: సాధారణంగా బరువు తగ్గటానికి ఓట్స్ తీసుకుంటాం. అలాగే ఓట్స్ పాలు కూడా శరీర బరువును పెంచవు. విటమిన్లతో పాటు దీనిలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆవు పాలకంటే ఓట్స్ మిల్క్​లో పది శాతం 'ఎ' విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం అల్పాహారంలో ఓట్స్ మిల్క్​ను తీసుకోవచ్చు.

oats milk
ఓట్స్ మిల్క్

బియ్యం పాలు: బియ్యం పాలను ఎర్ర బియ్యం నుంచి తయారుచేస్తారు. ఎర్ర బియ్యాన్ని నానబెట్టి, ఉడికించి పిండి చేసి చాలా చిక్కగా చేస్తారు. లాక్టోజ్ సరిపడని వారికి బియ్యం పాలు చాలా ఉత్తమం. ఈ పాలల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా లభిస్తాయి కానీ కొవ్వు, ప్రోటీన్ ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. ఓట్ మీల్క్​, సూప్, సాస్​లలో రైస్ మిల్క్ ఉపయోగించవచ్చు. ఇవి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. దీనిలో కొంచెం వెనిలా కలిపితే అచ్చం ఆవు పాల రుచిని పోలి ఉంటాయి. చర్మ సమస్యలకు బియ్యం పాలు అద్భుతంగా పని చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్-ఇ, మెగ్నీషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది రైస్ మిల్క్.

ఇదీ చదవండి:బెల్లంలో ఎన్నో పోషక విలువలు.. తెలుసుకుంటే ఆరోగ్యానికి మేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.