మెక్సికన్ సల్సాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆకలి తీరిపోతుంది పైగా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి మెక్సికన్ చంకీ సల్సా సొంతం. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి..
కావాల్సిన పదార్థాలు
- టొమాటోలు - 2
- ఉల్లిపాయ - 1
- క్యాప్సికం - 1
- పచ్చి మిరపకాయలు - 2
- టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్స్
- వెనిగర్ - టేబుల్ స్పూన్
తయారీ విధానం..
టొమాటోలు సన్నగా కట్ చేసుకుని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని చేతితో లేదా మ్యాషర్‌ని ఉపయోగించి మ్యాష్ చేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ, పొయ్యిపై కాల్చిన క్యాప్సికం, పచ్చి మిరపకాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకుని మ్యాష్ చేసిన టొమాటోకి జత చేసుకోవాలి. చివరగా టొమాటో కెచప్, వెనిగర్ కలిపితే చాలు.. మెక్సికన్ చంకీ సల్సా సిద్ధమైనట్లే..!
ఇదీ చదవండి: మైదా మచ్చుకైనా లేని అరటిపండు బ్రెడ్ రెసిపీ..!