పిల్లలకు పౌష్ఠికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా వారికి ఇచ్చే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి పోషకాహారాల్లో ఒకటి కర్ణాటక స్టైల్లో చేసే బిసిబెలా బాత్ (Bisi Bele Bath). ఇందులో అన్ని రకాలైన కూరగాయలు వేస్తాం. కాబట్టి పోషకాలు దండిగా ఉంటాయి. కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఎంతో శారీరక శక్తిని ఇస్తుంది. ఈ క్రమంలో దీని తయారీ విధానాన్ని ఓ సారి చూద్దాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బిసి బెలా బాత్ తయారీ విధానం..
మునగ, గుమ్మడికాయ, సొరకాయ, బీన్స్, క్యారెట్, టొమాటో, బంగాళాదుంపలను ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. వాటితో పాటే ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న కందిపప్పు, పల్లీలు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టుకొని 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక పాన్‌లో నూనె వేడి చేసుకొని.. అందులో ఎండుకొబ్బరి, పండుమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, శనగపప్పు, మినపప్పు, మెంతులు, నువ్వులు, గసగసాలు వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసి పౌడర్‌గా చేసుకోవాలి. తరువాత బాండిలో నెయ్యి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, పసుపు వేసి కలుపుకొని తాలింపు చేసుకోవాలి. అనంతరం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయలను అన్నం మిశ్రమంలో కొంచెం నీళ్లు పోసి మళ్లీ స్టౌ వెలిగించుకొని ఉడుకుతుండగానే మనం చేసుకున్న మసాలా పొడి, చింతపండు రసం వేసి బాగా ఉడకబెట్టుకొని, చివరగా నెయ్యి తాలింపుని వేసి కలుపుకుంటే బిసిబెలా బాత్ రెడీ.
బిసిబెలా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
- మునగకాయ ముక్కలు
- గుమ్మడి కాయ ముక్కలు
- సొరకాయ ముక్కలు
- బీన్స్ ముక్కలు
- క్యారెట్ ముక్కలు
- టొమాటో ముక్కలు
- బంగాళా దుంప ముక్కలు
- బియ్యం
- కందిపప్పు
- పల్లీలు
- ఎండు మిర్చి
- గసగసాలు
- మెంతులు
- శనగపప్పు
- మరాఠీ మొగ్గ
- దాల్చిన చెక్క
- ధనియాలు
- లవంగాలు
ఇదీ చూడండి: Protein content: మీ డైట్ కోసం ప్రోటీన్ చాట్.. ఎలా చేయాలంటే?