Making Curd: భారతీయ వంటకాల్లో పెరుగుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మనం తినే భోజనంలో ఎన్ని రకాల వంటకాలు తిన్నా.. చివరగా పెరుగుతో ఓ రెండు ముద్దల అన్నం తినకపోతే ఏదో వెలితిగానే అనిపిస్తుంటుంది. దాంతో పాటే పెరుగు.. మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే మనందరికీ ఎంతో ఇష్టమయ్యే.. పెరుగు రెడీ అవ్వాలంటే ముందు తోడు పెట్టుకోవాల్సిందే అని అనుకుంటాం. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే!.. తోడు లేకుండానే పెరుగు తయారు చేసుకునే ఓ సులభమైన, అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది. తెలుసుకుందామా మరి!
కావాల్సిన పదార్థాలు..
- గోరు వెచ్చని పాలు
- ఎండు మిరపకాయలు
తయారు చేసే విధానం..
ముందుగా పాలను బాగా వేడిచేసి.. తర్వాత చల్లార్చి పక్కనపెట్టాలి. ఆ గోరువెచ్చని పాలలో తొడిమలు ఉన్న ఎండు మిరపకాయలను వేయాలి. ఇప్పుడు ఆ పాలను కుక్కర్లో పెట్టి మూతపెట్టాలి. 24 గంటల పాటు పక్కనపెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ తీసి చూస్తే.. పెరుగు రెడీ! ఆలస్యమెందుకు.. మీరూ ట్రై చేయండి మరి.
ఇవీ చదవండి: 'కరివేపాకు చేపల ఫ్రై'... సింప్లీ సూపర్బ్ అంతే!
బరువు తగ్గాలా?.. ఇంట్లోనే ఈ వంటలు ట్రై చేయండి! ఒబెసిటీ పరార్!!