భారతీయ వంటకాల్లో పెరుగుకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. భోజనంలో ఎన్ని వంటకాలు తిన్నా.. పెరుగు లేకుంటే మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తుంది. మరి అందరికీ ఇష్టమయ్యే.. ఈ పెరుగు రెడీ అవ్వాలంటే ముందు తోడు ఉండాల్సిందే.. అయితే తోడు లేకుండానే పెరుగు తయారు చేసుకునే అద్భుతమైన చిట్కాను ఇప్పుడు చూద్దాం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కావాల్సిన పదార్థాలు..
- గోరు వెచ్చని పాలు
- ఎండు మిరపకాయలు
తయారీ విధానం..
మొదట పాలను బాగా వేడిచేసి.. తర్వాత చల్లార్చి పక్కనపెట్టాలి. ఆ గోరువెచ్చని పాలలో తొడిమలు ఉన్న ఎండుమిరపకాయలను వేయాలి. ఇప్పుడు ఆ పాలను కుక్కర్లో పెట్టి మూతపెట్టాలి. 24 గంటలపాటు పక్కనపెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ తీసి చూస్తే.. నాణ్యమైన పెరుగు మీసొంతం.. మీరూ తప్పకుండా ట్రై చేయండి.
ఇవీ చదవండి:
Curd : పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?