ETV Bharat / priya

మెదడును రిఫ్రెష్​​ చేసే 'మసాలా ఛాయ్'​ - మసాలా టీ తయారు విధానం

భారతీయుల దినచర్య ప్రతిరోజు 'టీ' లేదా 'ఛాయ్​'తోనే మొదలవుతుంది. ఓ కప్పు కడుపులో పడకపోతే ఆ రోజంతా హుషారు తగ్గినట్లు ఫీలవుతుంటారు. సాధారణంగా టీ పొడి, పాలతో ఛాయ్​ తయారు చేస్తారు. అయితే ఈ పానియాన్ని ఎప్పుడైనా విభిన్నంగా ప్రయత్నించారా? లేదంటే ఈ 'మసాలా ఛాయ్​'ను ఓసారి ట్రై చేయండి!

How to make masala chai
మెదడును రిఫ్రెష్​​ చేసే 'మసాలా ఛాయ్'​
author img

By

Published : Jun 11, 2020, 1:27 PM IST

టీ లేదా ఛాయ్​ని భారతీయులు అమితంగా ఇష్టపడతారు. అంతేకాదు దేశ సంస్కృతిలో ఛాయ్​ ఓ భాగమని భావిస్తారు. అందుకే ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే మొట్టమొదట 'టీ తాగుతారా?' అని అడుగుతారు. ఇటీవల 'టీ బోర్డు ఆఫ్ ఇండియా(టీబీఐ)' చేసిన సర్వేలో ఇప్పటికీ 80 శాతం మంది పాలతో తయారు చేసిన 'ఛాయ్​' నే తాగుతున్నారని తేలింది. అయితే ఎప్పుడూ ఒకేలా టీ తయారు చేయడమేనా! కాస్త కొత్తగా 'మసాలా ఛాయ్​' ట్రై చేసి సాయంత్రం స్నాక్స్​ సమయంలో ఆస్వాదించండి. మీ మెదడును మరింత ఉల్లాసంగా ఉంచుకోండి.

కావాల్సిన పదార్థాలు

యాలికలు-2 లేదా 3,

మిరియాలు-10 నుంచి 12,

లవంగాలు-2 లేదా 3,

దాల్చిన చెక్క- ఒక ఇంచు,

అల్లం-తగినంత,

నీళ్లు- 2 కప్పులు,

పుదీన ఆకులు-3 లేదా 4,

టీ పొడి-1 నుంచి 2 టీస్పూన్​,

పాలు-1 కప్పు,

చక్కెర- 2నుంచి 3 టేబుల్​ స్పూన్లు​.

తయారు చేసే విధానం..

యాలికలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చెయ్యాలి. ఓ పాత్రలో రెండు కప్పుల నీళ్లు, పుదీన ఆకులు, తరిగిన అల్లం 1 టీస్పూన్​, పొడిచేసిన మసాలా దినుసులు-1 టీ స్పూన్, టీ పొడి, ఓ కప్పు పాలు, రెండు టేబుల్​ స్పూన్లు ​చక్కెర వేసి బాగా మరిగించాలి. దాన్ని ఓ కప్పులో వడకట్టి.. కావలసినంత చక్కెర వేసుకోవాలి. అంతే మసాలా టీ రెడీ. మీరూ తయారు చేసి మీ అభిప్రాయాలను ఈటీవీ భారత్​తో పంచుకోండి.

మసాలా ఛాయ్​ను తయారు చేయండి ఇలా

ఇదీ చూడండి: మరోసారి బిగ్​బీ ఉదారత.. ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.