ETV Bharat / priya

నోరూరించే 'దహీ వడ' సింపుల్​ రెసిపీ! - etv bharat food

'తింటే గారెలు తినాలి' అనే నానుడి ఊరికే రాలేదండోయ్. మినుముల్లో ఉండే ప్రోటీన్లు.. ఎంత తిన్నా బోర్​ కొట్టని గారెల రుచే వీటికి కారణం. మరి ఆ గారెలకు పెసరపప్పు, శనగపప్పు, పెరుగు జోడించి.. దహీ వడ చేస్తే.. అంతకు మించిన ఆరోగ్యం ఉంటుందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆహా అనిపించే దహీవడ ఎలా చేయాలో చూసేద్దాం రండి...​

vada
నోరూరించే 'దహీ వడ' సింపుల్​ రెసిపీ!
author img

By

Published : Jul 2, 2020, 1:01 PM IST

Updated : Jul 3, 2020, 9:45 AM IST

కొన్ని రెసిపీలు కొన్ని ప్రాంతాల వారు ఇష్టంగా తింటారు. కానీ, దహీ వడను మాత్రం యావత్​ దేశం ఇష్టపడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రఖ్యాతి గాంచిన దహీ వడలోని పోషకాలు, దాని రుచి అలాంటివి మరి. మరి ఆ టేస్టీ పెరుగు వడ ఇలా ఇంట్లోనే చేసుకుని మీరూ రుచి చూడండి...

నోరూరించే 'దహీ వడ' సింపుల్​ రెసిపీ

కావాల్సినవి ఇవే...

  • పెసరపప్పు- అర కప్పు
  • మినప్పప్పు -అర కప్పు
  • ఉప్పు- తగినంత
  • ఎండు ద్రాక్షలు- 2 టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి- 1 టేబుల్​ స్పూన్​​
  • తరిగిన అల్లం- 1 టేబుల్​ స్పూన్​
  • శనగ పిండి-2 టేబుల్​ స్పూన్లు
  • నూనె- డీప్​ ఫ్రైకి సరిపడా
  • తాజా పెరుగు- 2 కప్పులు
  • నల్ల ఉప్పు- 1 టీస్పూన్​
  • చక్కెర - 2 టేబుల్​ స్పూన్లు
  • పాపడ్​ (చిన్న అప్పాలు) - 7
  • పుదీన చట్నీ- రుచికి సరిపడా
  • ఖర్జూర చట్నీ-రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి- చిటికెడు

తయారీ ఇలా...

నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు, మినప్పప్పులను మెత్తగా, చిక్కగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంలో ఎండు ద్రాక్షలు, పచ్చిమిర్చి, తరిగిన అల్లం, శనగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో పిండిని చిన్న చిన్న గారెలుగా లేదా ఉండలుగా వేసి.. బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ వడలను 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆపై పెరుగులో నల్ల ఉప్పు, చక్కెర వేసి బాగా గిలక్కొట్టాలి. ఆపై, నానబెట్టుకున్న వడలోంచి నీరు పిండేసి... పాపడ్​లపై పెట్టి వడ మునిగేంత వరకు పెరుగు వేయాలి. పుదీనా, ఖర్జూరం చట్నీ, జీలకర్రపొడి వేసుకోవాలి. చివరగా దానిమ్మ గింజలు వేసి వడ్డిస్తే.. కమ్మని దహీవడ రుచికి ,తిన్నవారంతా ఫిదా అయిపోతారు.

మరి ఈ సింపుల్​ దహీ వడ మీరూ ట్రై చేసి.. మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి.

ఇదీ చదవండి: టేస్టీ 'స్టఫ్డ్​ ఎగ్..' నూనె లేకుండా సింపుల్​గా​ చేసుకోండిలా!​

Last Updated : Jul 3, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.