ETV Bharat / priya

మండే వేసవిలో చల్లచల్లని లస్సీ తాగేద్దామా...! - తెలంగాణ వార్తలు

ఎర్రటి ఎండల్లో తియ్యని, చల్లని లస్సీ తాగితే ఎంత బాగుంటుందో కదా... అప్పుడు మండే సూరీడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఎండల్లో హాయ్‌హాయ్‌ అనుకోవాలంటే వీటిని ఓ చూపు చూడాల్సిందే మరి.

lassi with fruits, lassi in summer
వివిధ పండ్లతో లస్సీలు, లస్సీ తయారీ
author img

By

Published : Apr 5, 2021, 3:38 PM IST

మండే ఎండలో చల్లచల్లగా లస్సీ తాగితే ఆహా.. ఎంత బాగుంటుందో కదా. శరీరానికి చలువ చేసే తియ్యని రుచికరమైన లస్సీలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి...

అరటిపండ్లతో

అరటిపండ్లతో

కావాల్సినవి: పెరుగు- కప్పు, అరటిపండ్లు- రెండు, పంచదార- రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ: అరటిపండ్లను చక్రాల్లా కోసుకోవాలి. మిక్సీజార్‌లో పెరుగు, అరటిపండ్ల ముక్కలు, పంచదార, కొంచె నీళ్లు పోసి బ్లెండ్‌ చేయాలి. పలచగా కావాలంటే ఎక్కువ నీళ్లు పోయాలి. లస్సీ చిక్కగా ఉండాలంటే తక్కువ నీళ్లు కలపాలి. కావాలంటే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు. ఇష్టమైతే పైన బాదం పలుకులు, టూటీఫ్రూటీ చల్లుకోవచ్చు. వీటితో లస్సీ రుచి మరింత పెరుగుతుంది.

మామిడి పండ్లతో

మామిడి పండ్లతో

కావాల్సినవి: పెరుగు- అరలీటరు, మామిడిపండు గుజ్జు- పావుకేజీ, పంచదార- నాలుగు టేబుల్‌స్పూన్లు.

తయారీ: పెరుగుకు సమానంగా నీళ్లు తీసుకోవాలి. పెరుగులో నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి. దీంట్లో పంచదార కలపాలి. బ్లెండ్‌ చేసినప్పుడే పంచదార వేసుకుంటే బాగా కరిగిపోతుంది. మామిడి గుజ్జు కూడా వేయాలి. ఈ గుజ్జును ఇంట్లోనే మామిడిపండ్ల నుంచి తీసుకోవచ్చు. మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ లస్సీని ఫ్రిజ్‌లో రెండు గంటలపాటు పెట్టుకుని తర్వాత తాగితే చాలా రుచిగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలతో

స్ట్రాబెర్రీలతో

కావాల్సినవి: పెరుగు- రెండు కప్పులు, స్ట్రాబెర్రీలు- పది, పంచదార- మూడు టేబుల్‌స్పూన్లు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు- రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ: స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కల్లా కోసుకోవాలి. మిక్సీజార్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు, పెరుగు, పంచదార వేసుకుని బ్లెండ్‌ చేసుకోవాలి. దీంట్లో కొన్ని చల్లటినీళ్లు కలిపి మళ్లీ బ్లెండ్‌ చేయాలి. తర్వాత గ్లాసుల్లో పోసుకుని పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు చల్లుకోవాలి. పంచదార బదులుగా తేనె కలిపినా మంచిదే.

ద్రాక్షపండ్లతో

ద్రాక్షపండ్లతో

కావాల్సినవి: పెరుగు- అరలీటరు, ద్రాక్షపండ్లు(సీడ్‌లెస్‌)- పావుకేజీ, పంచదార- పావుకప్పు, ఉప్పు- చిటికెడు.

తయారీ: పెరుగు, ద్రాక్షపండ్లు, పంచదార, ఉప్పు అన్నింటినీ మిక్సీజార్‌లో వేసుకుని బ్లెండ్‌ చేయాలి. దీన్ని తయారుచేసిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. అన్ని పదార్థాలను ముందుగానే ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాతే లస్సీ తయారుచేయాలి. పంచదార సరిచూసుకుని అవసరమైతే వేసుకోవాలి. చివరగా వడకట్టుకుని ద్రాక్షపండ్ల తొక్కలను వేరుచేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

చాక్లెట్‌ లస్సీ

చాక్లెట్‌ లస్సీ

కావాల్సినవి: పెరుగు- కప్పు, పాలు- పావుకప్పు, పంచదార పొడి- రెండు టేబుల్‌స్పూన్లు, కోకో పౌడర్‌- టేబుల్‌స్పూన్‌, చాక్లెట్‌ సిరప్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు.

తయారీ: మిక్సీజార్‌లో పెరుగు, పాలు, పంచదారపొడి, కోకోపౌడర్‌, చాక్లెట్‌ సిరప్‌ అన్నీ వేసి బ్లెండ్‌ చేయాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని మరోసారి బ్లెండ్‌ చేయాలి. చల్లని నీళ్లను కలిపినా సరిపోతుంది. తయారైన లస్సీని గ్లాసులో పోసుకున్న తర్వాత పైన కాస్త చాక్లెట్‌ సిరప్‌ వేసుకుంటే లస్సీ ఇంకా రుచిగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగేస్తారు.

ఇదీ చదవండి: సబ్జాతో లస్సీ.. చేయడం చాలా ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.