ETV Bharat / priya

పండ్లు, కూరగాయలను శుభ్రం చేసేయండిలా... - కొవిడ్​-19

కరోనా నియంత్రణ కోసం తరచుగా సబ్బులు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరి పండ్లు, కూరగాయల సంగతి ఏంటి? వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

how to wash fruits and vegetables
పండ్లు, కూరగాయలనూ శుభ్రం చేసేయండిలా!
author img

By

Published : Apr 14, 2020, 1:33 PM IST

కొవిడ్​-19 కట్టడిలో భాగంగా చేతులను ఎప్పటికప్పుడు సబ్బు లేదా శానిటైజర్​తో శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే పండ్లు, కూరగాయలపైనా మరింత శ్రద్ధ అవసరం. బయట నుంచి తీసుకొచ్చే పండ్లు, కూరగాయల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. అలాగని వాటిని సబ్బుతోనో, సర్ఫుతోనో అస్సలు కడగొద్దు. ఈ మధ్య పండ్లు, కూరగాయలను వీటితో కడిగినట్లు పలు వీడియోలు వైరల్​ అవుతున్నాయి. ఇదేదో బాగుందని అలా చేస్తే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నట్లే.

మరి ఇంతకీ ఎలా శుభ్రం చేయాలి అంటే..

  • నల్లా నీటి కింద కూరగాయలను ఉంచి శుభ్రం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • నీటిలో కాస్త ఉప్పు వేసుకొని శుభ్రపరుచుకోవచ్చు.
  • నీళ్లలో కొద్దిగా వెనిగర్​ లేదా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్​ సోడా కలిపి కూరగాయలను శుభ్రం చేసుకుంటే మంచిది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.
  • క్యారెట్లు, పుచ్చ, దోసకాయలను అవసరమనుకుంటే స్క్రబ్బింగ్​ బ్రష్​ ఉపయోగించి కడగొచ్చు.

ఇదీ చదవండి: లాక్​డౌన్ 2.0పై రేపు మార్గదర్శకాలు- 3 జోన్లుగా భారత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.