గోరుచిక్కుడులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఎప్పుడూ ఒకేలా కూరలు వండితే పిల్లలు, పెద్దలు పెద్దగా ఇష్టపడరు... మరి వెరైటీగా గోరుచిక్కుడు రొట్టెలు తినిపించేయండి....
కావలసినవి:
- గోరుచిక్కుడు కాయలు: అర్ధపావు
- బియ్యప్పిండి: 4 కప్పులు
- ఉల్లిపాయలు: రెండు
- పచ్చిమిర్చి: నాలుగు
- కరివేపాకు తురుము: 2 టీ స్పూన్లు
- కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు
- జీలకర్ర: టీస్పూను
- కారం: అరటీస్పూను
- నూనె: 2 టీస్పూన్లు
- ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం:
- ముందుగా గోరుచిక్కుడు కాయల్ని ఉడికించి ఈనెలు తీయాలి.
- ఓ గిన్నెలో బియ్యప్పిండి, గోరుచిక్కుడు కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి ముద్దలా కలపాలి.
- ఇప్పుడు పిండిముద్దను మనకు కావాల్సిన సైజులో తీసుకొని చేత్తోనే రొట్టెలా వత్తుకుని పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.
ఇదీ చదవండి: చల్లగా వాన పడుతుంటే.. హెల్తీ చిప్స్ చేసుకోండిలా!