చేప.. ఆరోగ్యాన్ని చేకూర్చే చక్కని వంటకం. దీనితో కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. అందుకే వీటిని (fish Patties recipe) ఎన్నో రకాలుగా వండుకుని ఆరగిస్తుంటాం. అయితే ఈ సారి చేపలను కొత్తగా రుచి చూడాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఫిష్ ప్యాటీస్ను (fish Patties) ట్రై చేసేయండి. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...
కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, శెనగ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, నూనె, ఉప్పు, మిరియాల పొడి.
తయారీ విధానం: స్టవ్‌పై ఓ గిన్నెలో ఫిష్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన చేపల ముల్లులను తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరో గిన్నెలో ఉల్లి, వెల్లుల్లి, శెనగపిండి, చేప ముక్కలను కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని నూనెలో కొద్దిగా ఫ్రై చేస్తే ఫిష్ ప్యాటీస్ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:మడకర్రలపై వండే చప్పిడి చేపలు.. సూపర్ టేస్ట్ గురూ!