ETV Bharat / priya

ఫిష్ ఫింగర్స్.. నోట్లో వేసుకుంటే కరగాల్సిందే! - ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం

చేపలతో చాలా రకాల వంటకాలు చేసుంటాం. మరి ఫిష్ ఫింగర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇలా చేసుకోండి.

fish fingers
ఫిష్ ఫింగర్స్.
author img

By

Published : Oct 13, 2021, 4:27 PM IST

చేపల వేపుడు నోరూరిస్తే.. పులుసు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.. మసాలా కూర.. మనసు లాగేస్తుంది. ఇగురు.. మరింత ఉంటే బాగుండనిపిస్తుంది.. అలాగే ఫిష్ స్నాక్స్‌ రకాల్లో ఫిష్ ఫింగర్స్​ ఒకటి. మరి క్షణాల్లో యమ్మీ యమ్మీ చేసే ఈ వంటకం తయారీ ఎలాగో చూద్దాం.

కావాల్సినవి పదార్థాలు

చేప ముక్కలు- ఆరు

నూనె- తగినంత

మైదా, కారం, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున

ఉప్పు- తగినంత

బ్రెడ్‌ పొడి- అర కప్పు

అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా చొప్పున

మిరియాల పొడి- అర చెంచా

గుడ్డు- ఒకటి.

తయారీ విధానం

గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, మిరియాల పొడి, గరంమసాలా, నిమ్మరసం, నూనె వేసి కలిపి కాసేపు నానబెట్టాలి. మరోప్లేట్‌లో మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో గుడ్డును బాగా గిలక్కొట్టాలి. చేప ముక్కలను మైదాలో దొర్లించి ఆ తర్వాత గుడ్డు సొనలో ముంచి, చివరకు బ్రెడ్‌ పొడి అద్దాలి. ఇలా తయారుచేసుకున్న వీటిని డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

ఇవీ చూడండి: అలర్జీకి జీవితాంతం మందులు వాడాల్సిందేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.