ETV Bharat / priya

గుడ్డుతో సమోసా చేసేయండిలా! - మైదాపిండి

లాక్​డౌన్​ వల్ల బయటకు వెళ్లట్లేదా.. మీకు నచ్చిన ఆహారం ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇవ్వడం కుదరట్లేదు కదా! ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లోనే ఉంటూ రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేసేయండి. ఎప్పుడూ కోడిగుడ్లతో కూర చేయడమేనా ఈసారి కాస్త భిన్నంగా గుడ్లతో స్నాక్స్​ను తయారు చేసేయండి.

egg samosa making process
గుడ్డుతో సమోసా చేసేయండిలా!
author img

By

Published : Apr 14, 2020, 6:10 PM IST

సమోసా.. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఎక్కువగా ఆలూ, ఉల్లి, నూడుల్స్​​, కార్న్​ ఇలాంటి వాటితో చేసే సమోసాలనూ తరచూ తింటూ ఉంటాం. ఈసారి కాస్త భిన్నంగా కోడిగుడ్డుతో చేసే సమోసాను రుచిచూద్దామాా! ఇంతకీ దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

గుడ్డుతో సమోసా చేయడానికి కావాల్సిన పదార్థాలు

మైదాపిండి: 2 కప్పులు

గోధుమపిండి: కప్పు

నూనె: వేయించడానికి సరిపడా

మంచినీళ్లు: పావు కప్పు

ఉడికించిన గుడ్లు: నాలుగు

మిరియాలపొడి: టీ స్పూను

ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

- ఉడికించిన గుడ్ల పెంకు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వాటిని మళ్లీ చాకుతోనే సన్నగా తురిమినట్లుగా కోయాలి. ఇప్పుడు అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి.

- వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పిండి ముద్ద చేసి సుమారు అరగంటసేపు తడి బట్టి కప్పి ఉంచాలి.

- పిండిని చిన్న ముద్దల్లా చేసి కాస్త పెద్ద చపాతీలా వత్తాలి. దీన్ని పెనంమీద వేసి రెండువైపులా కాల్చి తీయాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు చేయాలి.

- వీటి అంచుల దగ్గర మాడినట్లు అయితే కత్తిరించి సగానికి కోయాలి. ఈ సగం చపాతీ ముక్కలన్నింటినీ తడిబట్టతో కలిపి చాపలా చుట్టి ఓ నిమిషం ఉంచి తీసేయాలి.

- ఇప్పుడు ఒక్కో ముక్కనీ తీసుకొని త్రికోణాకారంలో మడిచి అందులో గుడ్డు మిశ్రమాన్ని పెట్టి సమోసాలా మడవాలి. ఇలాగే అన్నీ చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.