ETV Bharat / priya

దీపావళి స్వీట్స్​ - పండగను మరింత తియ్యగా జరుపుకోండి! - కొబ్బరి లడ్డు

Diwali Special Dishes: దీపావళి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దీపాలు, టపాసులు, ఆ తర్వాత నోరూరించే స్వీట్స్. మరి, ఈ పండగవేళ ఎలాంటి స్వీట్స్​ తయారు చేస్తున్నారు..? ఇంకా ఫిక్స్ కాలేదంటే మాత్రం.. వీటిపై ఓ లుక్కేయండి.

Diwali_Special_Dishes
Diwali_Special_Dishes
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 5:25 PM IST

Diwali Special Dishes and Its Making Process in Telugu : దీపావళి పండగ అంటేనే.. దీపాల వెలుగు.. బాణాసంచా మోతలు, పిండి వంటలు ఘుమఘుమలు. ఈ పర్వదినాన ఎలాంటి రెసిపీలు చేసినప్పటికీ.. తప్పకుండా స్వీట్స్ ఉండి తీరాల్సిందే. కుటుంబ సభ్యులు ఇష్టంగా ఆరగించడంతోపాటు.. బంధుమిత్రులకు కూడా వీటిని పంచి పెడతారు. అయితే.. బయట కొనితెచ్చే స్వీట్స్​ కన్నా.. ఇంట్లో తయారు చేసినవే.. ఫ్రెష్​గా, సూపర్​ టేస్టీగా ఉంటాయి. సో.. ఈ రెసిపీలను ఓ సారి ట్రై చేయండి.

మిల్క్‌ పౌడర్‌ బర్ఫీ:

కావాల్సిన పదార్థాలు:

  • పాలపొడి - కప్పు,
  • పాలు - పావు కప్పు,
  • చక్కెర పొడి- 1/3 కప్పు,
  • నెయ్యి- మూడు చెంచాలు,
  • బాదం, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు,
  • కుంకుమ పువ్వు- చిటికెడు

దీపావళి రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే.. సిరిసంపదలు మీ సొంతం!

తయారీ విధానం:

  • స్టౌ వెలిగించి నాన్‌స్టిక్‌ ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టుకొని వేడెక్కాక, అందులో చెంచా నెయ్యి, పాలు పోసుకోవాలి.
  • అవి కాస్త వేడెక్కాక కొద్దికొద్దిగా పాలపొడిని వేస్తూ ఉండల్లేకుండా లేకుండా బాగా కలపాలి.
  • తరువాత చక్కెర కూడా వేసి కలపాలి.
  • మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు అందులో రెండు చెంచాల నెయ్యి వేసి, స్టౌ ఆఫ్ చేయాలి.
  • ఇప్పుడు.. వెడల్పాటి ప్లేటుకు నెయ్యి రాసి దానిపై ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా పరుచుకొనేటట్టు గరిటెతో సర్దుకోవాలి.
  • ఆపై కుంకుమపువ్వు, బాదం పలుకులు చల్లి, గది ఉష్ణోగ్రత దగ్గరే ఓ గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
  • చివరగా దాన్ని సమాన ముక్కలుగా కట్‌ చేసుకుంటే పాలపొడి బర్ఫీ రెడీ.

దీపావళి స్పెషల్​ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

కొబ్బరి లడ్డు:

కావాల్సిన పదార్థాలు:

  • కొబ్బరి తురుము- రెండు కప్పులు,
  • చక్కెర- కప్పు,
  • పాలు- కప్పు,
  • యాలకుల పొడి- చెంచా,
  • బాదం పలుకులు- చెంచా,
  • జీడి పప్పులు- ఆరు,
  • ఎండుద్రాక్ష- కొన్ని

తయారీ విధానం:

  • స్టౌ వెలిగించి.. నాన్‌స్టిక్‌ పాన్‌లో ముందుగా కొబ్బరి తురుము వేయించుకోవాలి.
  • తర్వాత పాలు, పంచదార కూడా వేసి దగ్గరకొచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
  • చివరగా ఈ మిశ్రమంలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  • కాస్త చల్లారాక అంటే గోరువెచ్చగా ఉండగానే నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలని కలిపి లడ్డూలు చుట్టుకుంటే రుచికరమైన కొబ్బరి లడ్డూలు సిద్ధం.

దీపావళి టపాసులు - మీ పెంపుడు జంతువుల​ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

డైమండ్​ చిప్స్​:

కావాల్సిన పదార్థాలు:

  • మైదా పిండి-పావుకిలో
  • బియ్యపిండి-50 గ్రాములు
  • వాము- టీస్పూన్​
  • ఉప్పు-రుచికి సరిపడా
  • డాల్డా లేదా నెయ్యి-50 మి.లీ.
  • నూనె-వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఒక గిన్నెలో పావుకిలో మైదా తీసుకోండి.
  • ఈ పిండిలో 50 గ్రాములు బియ్యం పిండి, ఓ టీ స్పూన్​ నలిపిన వాము, రుచికి సరిపడా సాల్ట్​, 50 మిల్లీ లీటర్లు కరిగించిన డాల్డా లేదా నెయ్యి వేసి పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి. (అంటే బ్రెడ్​ పొడిలా)
  • తర్వాత నీళ్లు కలుపుకుంటూ పిండిని గట్టి ముద్ద అయ్యేవరకు కలపాలి.
  • కలిపిన పిండిని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత పిండిని మీడియం సైజులో ముద్దలుగా చేసుకోని.. పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి.
  • తర్వాత ఓ చాకు తీసుకోని.. పిండిని డైమండ్​ షేప్​లో కట్​ చేసుకోవాలి (మరీ పెద్దగా ఉండొద్దు.. చిన్నగా ఉండొద్దు)
  • తర్వాత కట్​ చేసిన వాటిని ఓ ప్లేట్​లోకి వేసుకోండి.(గుర్తుంచుకోండి కట్​ చేసిన డైమండ్​లను కుప్పగా పెట్టొద్దు)
  • తర్వాత కట్​ చేసుకున్న డైమండ్స్​ను నూనెలో వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్​లోనే వీటిని వేయించుకోవాలి.
  • డైమండ్స్​ లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చిన తర్వాత వాటిని ఓ చిల్లుల గిన్నెలోకి తీసుకుని.. గాలికి ఆరనివ్వాలి.
  • ఎందుకంటే ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయి. ఓ రెండు గంటల తర్వాత క్రిస్పీగా అవుతాయి.
  • మరో విషయం వీటిని గోధుమపిండితో కూడా చేసుకోవచ్చు.

దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.