ETV Bharat / priya

ఈ దోశలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా? - బ్రెడ్​ దోశ

రోజూ ఏ దోశ వేస్తాం? సాదా దోశ లేదంటే రవ్వ దోశ. మహా అయితే ఎగ్‌ దోశ. ఈసారి సరికొత్తగా వాటికి భిన్నంగా తయారు చేసేద్దాం. అదిరిపోయో టేస్ట్​తో కూడిన ఆ దోశలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా?

Different Types of Dosa Recipes
ఈ దోశలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా?
author img

By

Published : Aug 24, 2021, 10:24 AM IST

దోశలు ఎప్పుడూ నోరూరిస్తాయి కానీ.. ఒకేరకం చేసుకోవాలంటేనే బోర్‌. అందుకే ఈసారి వాటికి మరికొన్ని పదార్థాలు చేర్చి కాస్త కొత్తగా చేసుకుందామా..

మరమరాలతో..

Different Types of Dosa Recipes
మరమరాల దోశ

కావాల్సిన పదార్థాలు:- బియ్యం (కప్పు),

మరమరాలు: నాలుగు కప్పులు,

మినప్పప్పు: పావుకప్పు,

మెంతులు: అరచెంచా,

నూనె: అరకప్పు.

తయారీవిధానం: బియ్యం, మినప్పప్పు, మరమరాలు, మెంతుల్ని మూడు గిన్నెల్లో వేసి విడిగా నానబెట్టుకోవాలి. బియ్యం, మినప్పప్పు నానాక మిక్సీలో వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఆ తరువాత అందులో మరమరాలు, మెంతులు వేసి కాసిని నీళ్లు పోసి దోశపిండిలా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా పులవనివ్వాలి. తరువాత స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా పరిచి చుట్టూ నూనె వేసి ఎర్రగా కాలాక తీసుకోవాలి.

ఓట్స్‌ కొబ్బరితో..

Different Types of Dosa Recipes
ఓట్స్​ కొబ్బరి దోశ

కావాల్సిన పదార్థాలు: గోధుమపిండి: అరకప్పు,

బియ్యప్పిండి: అరకప్పు,

ఓట్స్‌పిండి: అరకప్పు,

కొబ్బరి తురుము: పావుకప్పు,

ఉప్పు: తగినంత,

నూనె: అరకప్పు,

పచ్చిమిర్చి: ఒకటి,

అల్లం తురుము: చెంచా,

కరివేపాకు రెబ్బలు: రెండు,

మిరియాలపొడి: అరచెంచా.

తయారీవిధానం: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనం పెట్టి నూనె వేసి ఈ పిండిని దోశలా వేసి.. మూత పెట్టాలి. రెండువైపులా కాలాక తీసేయాలి. దీనికి కొబ్బరిచట్నీ మంచి కాంబినేషన్‌.

అడై దోశ

Different Types of Dosa Recipes
అడై దోశ

కావాల్సిసిన పదార్థాలు: బియ్యం: ముప్పావుకప్పు,

సెనగపప్పు: పావుకప్పు,

కందిపప్పు: పావుకప్పు,

పెసరపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు,

మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు,

అల్లం: చిన్న ముక్క,

ఎండుమిర్చి: అయిదు,

జీలకర్ర: ముప్పావుచెంచా,

ఉప్పు: తగినంత,

ఉల్లిపాయ: ఒకటి,

కొత్తిమీర: కట్ట,

నూనె: అరకప్పు.

తయారీ విధానం: ముందురోజు పప్పులూ, బియ్యం, ఎండుమిర్చిని విడివిడిగా నానబెట్టుకోవాలి. మర్నాడు మొదట బియ్యాన్ని మెత్తగా రుబ్బుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను మిక్సీలో తీసుకుని అన్నింటినీ మెత్తగా రుబ్బుకుని బియ్యప్పిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. స్టౌమీద పెనం పెట్టి ఈ పిండిని దోశలా వేసి నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.

బ్రెడ్‌తో..

Different Types of Dosa Recipes
బ్రెడ్​ దోశ

కావాల్సిన పదార్థాలు: బ్రెడ్‌స్లైసులు: నాలుగు,

బొంబాయిరవ్వ: కప్పు,

బియ్యప్పిండి: కప్పు,

ఉప్పు: తగినంత,

జీలకర్ర: అరచెంచా,

ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు,

అల్లం తరుగు: రెండు చెంచాలు,

పచ్చిమిర్చి తరుగు: చెంచా,

నూనె: అరకప్పు.

తయారీవిధానం: బ్రెడ్‌స్లైసుల్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర మిక్సీలో వేసి.. కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలో వేసి.. మరికాసిని నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా పరిచి.. చెంచా నూనె వేయాలి. కొద్దిగా కాలాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేయాలి. దోశ పూర్తిగా కాలాక ప్లేటులోకి తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.

ఆలుతో..

Different Types of Dosa Recipes
ఆలూ దోశ

కావాల్సిన పదార్థాలు: మైదా: కప్పు,

సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు,

బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు,

పచ్చిమిర్చి తరుగు: చెంచా,

బంగాళాదుంపలు: రెండు (తురుముకోవాలి),

పసుపు: అరచెంచా,

కారం: చెంచా,

ఉప్పు: తగినంత,

పాలకూర తరుగు: పావుకప్పు,

నూనె: అరకప్పు.

తయారీవిధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా వేసి.. రెండువైపులా నూనె వేస్తూ కాల్చుకుని తీసుకోవాలి.

స్వీట్‌కార్న్‌తో..

Different Types of Dosa Recipes
స్వీట్​ కార్న్​ దోశ

కావాల్సిన పదార్థాలు: బియ్యం: కప్పు,

స్వీట్‌కార్న్‌: కప్పు,

జీలకర్ర: అరచెంచా,

పచ్చిమిర్చి: రెండు,

ఉప్పు: తగినంత,

నూనె: అరకప్పు.

తయారీవిధానం: బియ్యాన్ని మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదు. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా వేసి నూనె వేసి, ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఈ దోశల్ని వేడివేడిగా తింటే భలే ఉంటాయి.

ఇదీ చూడండి.. నోరూరించే రొయ్యదోశలు.. తింటే వదలరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.