ETV Bharat / priya

చాట్‌.. టిక్కీ.. భుజియా.. ఆలుతో సరదాగా! - different dishes with potato

బంగాళదుంపను వేయించినా... ఉడకబెట్టినా...పచ్చడి చేసినా ఇంకాస్త వడ్డించమని అడగకుండా ఉండలేరు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినే బంగాళాదుంప(ఆలు)తో ఎన్ని వెరైటీలు చేసినా అదుర్సే. ఇంకెందుకాలస్యం మీరూ ప్రయత్నించండి మరి.

different dishes with potato
చాట్‌.. టిక్కీ.. భుజియా.. ఆలుతో సరదాగా!
author img

By

Published : Mar 13, 2021, 12:27 PM IST

ఆలూ టిక్కీ

చాట్‌.. టిక్కీ.. భుజియా.. ఆలుతో సరదాగా!
ఆలూ టిక్కీ

కావాల్సినవి :

ఉడికించిన బంగాళాదుంపలు- పావుకేజీ, కారం- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా, గరంమసాలా పొడి- పావు టీస్పూన్‌, కొత్తిమీర తరుగు- గుప్పెడు, బ్రెడ్‌పొడి- రెండు టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌- టేబుల్‌స్పూన్‌.

తయారీ :

బంగాళాదుంపలను గిన్నెలోకి తీసుకుని మెత్తగా మెదపాలి. దీంట్లో ఉప్పు, కారం, గరంమసాలా, బ్రెడ్‌పొడి, కార్న్‌ఫ్లోర్‌, కొత్తిమీర తరుగు అన్నీ వేసి బాగా కలపాలి. బ్రెడ్‌పొడి వల్ల టిక్కీ రుచి పెరుగుతుంది. కార్న్‌ఫ్లోర్‌ కలపడంతో విడిపోకుండా ఉంటుంది. అరచేతిలో నూనె రాసుకుని పిండిని గుండ్రంగా చేసి వడల్లా ఒత్తుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి మూడు టిక్కాల చొప్పున వేయించాలి. ఒకవైపు వేగిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పి తక్కువ మంట మీద వేయించాలి.

దమ్‌

different dishes with potato
దమ్‌

కావాల్సినవి :

ఉడికించిన బంగాళాదుంపలు- పావుకిలో, చిన్నముక్కలుగా కోసిన టొమాటో- ఒకటి, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌, పెరుగు- కప్పు, ధనియాల పొడి, గరంమసాలా, జీలకర్ర- అర టేబుల్‌స్పూన్‌ చొప్పున, లవంగాలు- మూడు, దాల్చినచెక్క- చిన్నముక్క, యాలకులు- రెండు, జీడిపప్పు- కొద్దిగా, కారం- టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత, పసుపు- పావు టీస్పూన్‌, కొత్తిమీర తరుగు- గుప్పెడు.

తయారీ :

కడాయిలో నూనె వేడిచేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు వేయించాలి. దీంట్లో ఉల్లిపాయముక్కలు ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఇవి మగ్గిన తర్వాత మిక్సీజార్‌లో వేసి మెత్తగా పేస్టు చేయాలి. ఉడికిన బంగాళాదుంపలకు ఫోర్క్‌తో రంధ్రాల పెట్టాలి. పాన్‌లో నూనె వేడిచేసి పసుపు, కారం ఉప్పు వేసి నిమిషంపాటు వేగనివ్వాలి. దీంట్లో బంగాళాదుంపలు వేసి వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే నూనెలో జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలా పేస్టు వేసి వేయించాలి. ఇప్పుడు పెరుగు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరంమసాలా వేయాలి. తర్వాత వేయించిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి పది నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి.

పచ్చడి

different dishes with potato
పచ్చడి

కావాల్సినవి :

బంగాళాదుంపలు- మూడు, కారం- పావుకప్పు, ఉప్పు- తగినంత, ఆవపిండి- పావుకప్పు, పసుపు- పావు టీస్పూన్‌, మెంతిపిండి- పావు టీస్పూన్‌, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రేకలు- గుప్పెడు.

తయారీ :

బంగాళాదుంపలను పొట్టు తీసి ముక్కలు కోసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి బంగాళాదుంప ముక్కలు వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి. ఇదే నూనెను బాగా చల్లార్చి ఉప్పు, కారం, పసుపు, ఆవ, మెంతిపొడి, వెల్లుల్లిరేకలు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలపాలి. దీంట్లో బంగాళాదుంపలు వేయాలి. రెండో రోజున కూడా మిశ్రమాన్ని మళ్లీ కలపాలి. మూడో రోజున ఈ పచ్చడిని తినొచ్చు. ఇది చాలా రోజులపాటు నిల్వ ఉంటుంది కూడా. అన్నం, చపాతీల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది.

చాట్‌

different dishes with potato
చాట్‌

కావాల్సినవి :

ఉడికించిన బఠానీ- కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు- పావుకేజీ, ఉడికించిన మొక్కజొన్న గింజలు- పావుకప్పు, ఉప్పు- తగినంత, కారం, జీలకర్ర పొడి, గరంమసాలా పొడి- టీస్పూన్‌ చొప్పున, కొత్తిమీర తరుగు- కొద్దిగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, చిన్నముక్కలుగా కోసిన టొమాటో- ఒకటి.
తయారీ :

కడాయిలో నూనె వేడిచేసి ఉడికించిన బఠానీ, పసుపు, కారం, ఉప్పు, గరంమసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మెదిపి దీంట్లో వేయాలి. కాసిన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేటులోకి వేసుకుని కొంచెం ఉప్పు, కారం, గరంమసాలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేయాలి. చివరగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పెరుగు, ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి అలంకరించాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.